సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Rashmika: బతుకమ్మ వేడుకల్లో రష్మిక సందడి..

ABN, Publish Date - Oct 19 , 2026 | 07:37 AM

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలు హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగాయి.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలు హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగాయి. హుస్సేన్ సాగర్ తీరాన ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన ఈ సంబరాల్లో సినీ నటి రష్మిక మందన్న(Rashmika Mandanna) తన భర్త, నటుడు విజయ్ దేవరకొండతో కలిసి సందడి చేశారు. సంప్రదాయ బతుకమ్మ (bathukamma) వేడుకల్లో ఈ జంట పాల్గొనడంతో అక్కడి వాతావరణం మరింత ప్రత్యేకంగా మారింది. ముఖ్యంగా రష్మిక సందడి ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ట్యాంక్‌బండ్‌పై పూల పండుగ సందడి.. 

ట్యాంక్‌బండ్‌ పరిసరాలు రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో పూలవనాన్ని తలపించాయి. మహిళలు, యువతులు, చిన్నారులు సంప్రదాయబద్ధంగా బతుకమ్మల చుట్టూ ఆడిపాడుతూ పండుగ సంబరాలను ఆస్వాదించారు. బతుకమ్మ పాటలు, కోలాటాలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలతో హుస్సేన్ సాగర్ తీరం సందడిగా మారింది. లేజర్ షో, బాణసంచా వెలుగులు వేడుకలకు మరింత శోభను తీసుకొచ్చాయి.ఈ వేడుకల్లో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలకే పరిమితం కాకుండా, తెలంగాణ సంప్రదాయ పండుగల్లోనూ ఈ జంట భాగస్వామ్యం కావడం విశేషం. రష్మిక, విజయ్‌ హాజరుతో బతుకమ్మ వేడుకలకు సినీ సందడి తోడైంది.

మంత్రి జూపల్లి సోషల్ మీడియా పోస్ట్

హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పాల్గొన్న విషయాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ వేడుకల్లో గవర్నర్ సతీమణి జానకి, మంత్రి సీతక్కతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.తెలంగాణ సంస్కృతి, మహిళల సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రజలంతా కలిసి ఘనంగా జరుపుకున్నారు. పూల అందాలు, సంప్రదాయ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనల నడుమ సాగిన ఈ వేడుకలు ట్యాంక్‌బండ్‌కు పండుగ శోభను తీసుకొచ్చాయి.

ALSO READ:

ఇవి కూడా చదవండి:

మనం ఎప్పుడూ భయపడకూడదు.. ఇచ్చిపడేయాలి: విశ్వక్‌సేన్

యంగ్ హీరోతో ‘ఓ పిట్టకథ’ దర్శకుడి చిత్రం ప్రారంభం

ముంబైలో సంచలనం.. హీరో టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. ఆ గ్యాంగ్ పనేనా?

Updated Date - Oct 19 , 2026 | 11:00 AM