సినిమాలకు బ్రేక్‌ ఇవ్వనున్న రష్మిక.. కారణమేంటి?

ABN , Publish Date - Jul 12 , 2026 | 02:37 PM

వివాహం చేసుకున్న తర్వాత కూడా రష్మిక అటు పర్సనల్ లైఫ్‌ను, ఇటు ప్రొఫెషనల్ లైఫ్‌ను అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తోంది. ఆమె కెరీర్ గ్రాఫ్ చూస్తుంటే, వివాహం ఆమె ఎదుగుదలకు ఏమాత్రం అడ్డుకాదని స్పష్టమవుతోంది.

Rashmika Mandanna

‘పుష్ప, యానిమల్’ వంటి సంచలన చిత్రాలతో పాన్‌ ఇండియా వైడ్‌గా నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకుంది రష్మిక మందన్న (Rashmika Mandanna). తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో లక్షలాది మంది అభిమానుల మనసు దోచుకున్న ఈ భామ, ఈ ఏడాది తన వ్యక్తిగత జీవితంలో తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు వివాహం చేసుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. అయితే, రష్మిక మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తన ప్రియుడు, టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)ను వివాహం చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది.


సాధారణంగా గ్లామర్ రంగంలో ఉన్న హీరోయిన్స్ కెరీర్ జోరుగా సాగుతున్న సమయంలో వివాహానికి దూరంగా ఉంటారు. కానీ, రష్మికా మాత్రం అందుకు భిన్నం. వివాహం చేసుకున్న తర్వాత కూడా అటు పర్సనల్ లైఫ్‌ను, ఇటు ప్రొఫెషనల్ లైఫ్‌ను అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తోంది. ఆమె కెరీర్ గ్రాఫ్ చూస్తుంటే, వివాహం ఆమె ఎదుగుదలకు ఏమాత్రం అడ్డుకాదని స్పష్టమవుతోంది. గతేడాది వరుసగా ఐదు భారీ చిత్రాలతో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్న రష్మిక, ఈ ఏడాది కూడా అదే జోరును కొనసాగిస్తోంది. ఈ ఏడాది బాలీవుడ్ చిత్రం ‘కాక్‌టెయిల్-2’తో అలరించిన రష్మిక, ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. ముఖ్యంగా, ఆమె భర్త విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న ‘రణబాలి’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు ‘మైసా’ అనే యాక్షన్ చిత్రంలో కూడా ఆమె నటిస్తోంది. ఈ సినిమాను కూడా ఇదే ఏడాది విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.


మైసా చిత్రం పూర్తిగా ట్రైబల్‌ బేస్డ్‌ యాక్షన్ ఓరియంటెడ్ కథాంశంతో రాబోతోంది. ఇటీవల ఈ మూవీ కోసం చిత్రీకరించిన అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్‌లో రష్మికా కనబరిచిన పెర్ఫామెన్స్‌కు చిత్రబృంద సభ్యులు సైతం ఫిదా అయ్యారట. నటనలో ఆమె చూపిస్తున్న ఈ వైవిధ్యం ప్రేక్షకులను మరోసారి ఆశ్చర్యపరచడం ఖాయం. అయితే, ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం చర్చకు వస్తోంది. రష్మికాకు సౌత్ నుంచి నార్త్ వరకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఆమె ఓకే అంటే చాలు, వరుస ప్రాజెక్టులు క్యూ కడతాయి. కానీ, కొత్త సినిమాలను అంగీకరించడంలో ఆమె కాస్త వెనకడుగు వేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సినిమా కమిట్‌మెంట్ల విషయంలో ఆమె కాస్త ఫుల్ స్టాప్ పెట్టినట్లే కనిపిస్తోంది. మరి, సినిమాలకు కావాలనే బ్రేక్ తీసుకుంటుందా? లేదా తన వ్యక్తిగత జీవితానికి మరికొంత సమయం కేటాయించాలనుకుంటుందా? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. కారణం ఏదైనప్పటికీ, ప్రేక్షకులు మాత్రం రష్మికా నుంచి మరిన్ని మంచి సినిమాలను ఆశిస్తున్నారు. రష్మిక మందన్న భవిష్యత్ నిర్ణయం ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి:

Jagapathibabu: మళ్లీ హీరోగా చేయడానికి కారణమదే..

అయ్యగారి కంబ్యాక్ అదుర్స్.. అఖిల్ కెరీర్‌లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్‌!

సావిత్రమ్మ అద్భుతాలకే అద్భుతం: బ్రహ్మానందం

Updated Date - Jul 12 , 2026 | 02:37 PM