అయ్యగారి కంబ్యాక్ అదుర్స్.. అఖిల్ కెరీర్‌లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్‌!

ABN , Publish Date - Jul 11 , 2026 | 02:55 PM

చాలా కాలంగా సరైన మాస్ హిట్ కోసం అక్కినేని అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. వారి సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ, ఎట్టకేలకు ఒక సాలిడ్ బ్లాక్ బస్టర్ అఖిల్ ఖాతాలో చేరిపోయింది.

Akhil Akkineni in Lenin

చాలా కాలంగా సరైన మాస్ హిట్ కోసం అక్కినేని అభిమానులు (Akkineni Fans) కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. వారి సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ, ఎట్టకేలకు ఒక సాలిడ్ బ్లాక్ బస్టర్ అఖిల్ (Akhil Akkineni) ఖాతాలో చేరిపోయింది. మురళీ కిషోర్‌ అబ్బూరు (Murali Kishor Abburu) దర్శకత్వంలో తెరకెక్కిన ‘లెనిన్’ (Lenin) చిత్రం ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి అడుగుపెట్టి, తొలి ఆట నుంచే సెన్సేషనల్ టాక్ సొంతం చేసుకుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా, అఖిల్ కెరీర్‌లోనే ఒక బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్‌గా నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. రిలీజ్ అయిన ప్రతి సెంటర్ నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తుండటంతో థియేటర్ల వద్ద ప్రస్తుతం పండుగ వాతావరణం నెలకొంది.


పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ కథలో అఖిల్ మేకోవర్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. గత చిత్రాలకు పూర్తి భిన్నంగా, ఒక రస్టిక్ లుక్‌లో అఖిల్ కనిపించిన తీరు అద్భుతం. యాక్షన్, ఎమోషనల్‌ సన్నివేశాల్లో అతను చూపించిన ఇంటెన్సిటీ, అఖిల్‌ పలికించిన హావభావాలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. నిజం చెప్పాలంటే ఇది అఖిల్ వన్ మ్యాన్ షో అని నిస్సందేహంగా చెప్పవచ్చు. తన భుజాలపై సినిమాను మోస్తూ, స్క్రీన్ మీద అతను చేసిన మ్యాజిక్‌కు థియేటర్లలో విజిల్స్ పడుతున్నాయి. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తన డీసెంట్ పెర్ఫార్మెన్స్‌తో అందరి దృష్టినీ ఆకర్షించింది. పల్లెటూరి వాతావరణానికి తగ్గట్టుగా ఆమె అభినయం, ముఖ్యంగా అఖిల్‌తో పంచుకున్న ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దర్శకుడు మురళీ కిషోర్‌ అబ్బూరి ఎంచుకున్న కథాంశం, దానిని ప్రెజెంట్ చేసిన విధానం అవుట్ స్టాండింగ్‌గా ఉన్నాయి. సెకండాఫ్‌కు ముందు వచ్చే ట్విస్టులు, ఊహించని మలుపులు ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడతాయి. ఎక్కడా ల్యాగ్ లేకుండా, ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్‌కు కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ దర్శకుడు సమపాళ్లలో దట్టించాడు.


ఈ భారీ విజయానికి ప్రధాన పిల్లర్ సంగీత దర్శకుడు థమన్. తన మార్క్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ప్రతి సన్నివేశాన్ని వేరే లెవెల్‌కు తీసుకువెళ్లాడు. కీలకమైన ఎలివేషన్ సీన్స్‌లో తమన్ ఇచ్చిన బీజీఎమ్‌ సినిమాకు ప్రాణం పోసింది. విజువల్స్ పరంగా చూసుకుంటే సినిమాటోగ్రఫీ సినిమా మూడ్‌ను అద్భుతంగా క్యారీ చేసింది. పల్లెటూరి అందాలను, అక్కడి రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎపిసోడ్స్‌ను కెమెరామెన్ చాలా రియలిస్టిక్‌గా క్యాప్చర్ చేశాడు. ఇక కలెక్షన్ల విషయానికి వస్తే, తొలిరోజే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 16.70 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరిచింది. ఈ మేరకు చిత్ర బృందం అఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ చేసి తమ ఆనందాన్ని పంచుకుంది. అఖిల్ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్‌గా రికార్డులకెక్కింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా లెనిన్ భారీ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. అక్కడి ఆడియన్స్‌కు కూడా ఈ స్టోరీ బాగా కనెక్ట్ అవ్వడంతో కలెక్షన్ల స్పీడ్ మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. సినిమా సాధించిన ఈ అద్భుతమైన విజయంతో లెనిన్ టీమ్ అంతా ఫుల్ సక్సెస్ మూడ్‌లో ఎంజాయ్ చేస్తోంది. ఇన్నాళ్ల కష్టం తర్వాత వచ్చిన ఈ భారీ హిట్‌తో అఖిల్ ఎమోషనల్ అయిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. అక్కినేని ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్ని తాకాయి. ఇప్పటి వరకు అఖిల్‌ నటించిన సినిమాలలో తొలిరోజు కలెక్షన్స్‌ పరంగా ‘లెనిన్‌’ ఫస్ట్‌ ప్లేస్‌లో నిలిచింది. ముఖ్యంగా ఈ వీకెండ్ పూర్తయ్యే సరికి ‘లెనిన్‌’ ఎన్ని వండర్స్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి. మొత్తానికి అయ్యగారి కంబ్యాక్ అదరహో అనిపించేలా ఉంది.

ఇవి కూడా చదవండి:

సావిత్రమ్మ అద్భుతాలకే అద్భుతం: బ్రహ్మానందం

టూర్‌కు రెడీ అవుతోన్న ప్రభాస్‌.. వచ్చాక ఇక ర్యాంపే!

అప్పుడు చిరంజీవి.. ఇప్పుడు నేను.. అదృష్టంగా భావిస్తున్నా: జయప్రద

Updated Date - Jul 11 , 2026 | 02:55 PM