Jagapathibabu: మళ్లీ హీరోగా చేయడానికి కారణమదే..

ABN , Publish Date - Jul 11 , 2026 | 04:25 PM

లెజెండ్‌ సినిమాతో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా బిజీ అయ్యారు జగపతిబాబు(Jagapathibabu). ఆ చిత్రంలో ఆయన పోషించిన నెగటివ్‌ రోల్‌ ఎంతో గుర్తింపు తీసుకొచ్చింది.

లెజెండ్‌ సినిమాతో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా బిజీ అయ్యారు జగపతిబాబు(Jagapathibabu). ఆ చిత్రంలో ఆయన పోషించిన నెగటివ్‌ రోల్‌ ఎంతో గుర్తింపు తీసుకొచ్చింది. అంతే కాదు.. ఆ తరహా పాత్రలతోపాటు రిచ్‌ ఫాదర్‌, బిజినెస్‌ మెన్‌ ఇలా విభిన్నమైన పాత్రలు పోషిస్తూ అలరిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘పెద్ది’ చిత్రంలో అప్పలసూరి పాత్రతో ఆకట్టుకున్నారు. అయితే ఇప్పుడు 'వదలా' చిత్రంతో మళ్లీ హీరోగా చేస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన సరసన లయ, హృతిక ఇద్దరు కథానాయికలున్నాయి.

తాజాగా ఆయన ఏబీఎన్‌ చిత్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఇప్పుడు హీరోగా, పక్కన ఇద్దరు హీరోయిన్‌లతో సినిమా చేయడం వెనకున్న కారణమేంటని ప్రశ్నించగా..

‘నాకంటూ ఓ ప్రత్యేకస్థానాన్ని క్రియేట్‌ చేసుకోవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. ఏ సినిమా చేసినా డిపెండెంట్‌గా ఉంటున్నాననిపించింది. హీరోకి ఓ క్యారెక్టర్‌గా చేస్తున్నా. అలాగని ఇప్పుడేదో హీరోగా చేయాలి.. హీరోయిన్‌లు ఇద్దరుండాలి.. డాన్స్‌లు చేయాలి అని కాదు. డిఫరెంట్‌ క్యారెక్టరైజేషన్‌లో, నా పాత్ర మెయిన్‌గా ఉంటూ అమితాబ్‌ బచ్చన్‌గారి పాత్రల తరహాలో ప్రత్యేకత చాటుకోవాలనిపించింది. దానికి ‘వదలా’ కథ కరెక్ట్‌ అనిపించింది. అందుకే చేశాను’ అని అన్నారు.

Updated Date - Jul 11 , 2026 | 04:36 PM