బ్యూటల్ యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్‌లో 'మైసా'
ABN, Publish Date - Apr 25 , 2026 | 09:03 PM
రశ్మిక మందన్న టైటిల్ రోల్ ప్లే చేస్తున్న మైసా సినిమా యాక్షన్ ఎపిసోడ్ కేరళలో మొదలైంది. 15 రోజుల పాటు ఈ బ్రూటల్ యాక్షన్ పాక్డ్ షూటింగ్ జరుగుతుందని మేకర్స్ తెలిపారు.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘మైసా’ (Mysaa) తో తన కెరీర్‌లోనే అత్యంత సవాల్‌తో కూడిన పాత్ర చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఇంటెన్స్ గ్లింప్స్‌తో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తాజాగా కేరళలో 15 రోజుల బ్రూటల్ యాక్షన్ ప్యాక్డ్ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైందని మేకర్స్ తెలిపారు. రష్మికతో పాటు ప్రధాన తారాగణమంతా ఈ యాక్షన్ షెడ్యూల్‌లో పాల్గొన్నబోతున్నారు. ఇది సినిమాలో మేజర్ హైలైట్‌గా ఉండబోతుంది.
'మైసా'లో రష్మిక గోండు గిరిజన మహిళగా నటిస్తోంది. ఈ పాత్రకు ఎమోషనల్ డెప్త్‌తో పాటు శారీరక దృఢత్వం కూడా అవసరం. ఇందుకోసం రష్మిక అంతర్జాతీయ యాక్షన్ డైరెక్టర్ ఆండి లాంగ్ పర్యవేక్షణలో బ్యాంకాక్‌కు వెళ్లి కఠినమైన స్టంట్, కాంబాట్ ట్రైనింగ్ తీసుకున్నారు. రోజుకు దాదాపు ఎనిమిది గంటల పాటు అడ్వాన్స్‌డ్ స్టంట్స్, హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్, హై స్పీడ్ యాక్షన్ టెక్నిక్స్ నేర్చుకున్నారు. ఆ రకంగా రష్మిక 'మైసా'లో ఇప్పటివరకు చూడని ఇంటెన్స్, ఎక్స్‌ప్లోసివ్ అవతార్‌లో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నారని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో ఈశ్వరి రావు, గురు సోమసుందరం, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటో గ్రఫీని శ్రేయాస్ పి కృష్ణ నిర్వహిస్తుండగా, జేక్స్ బీజోయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. అంతర్జాతీయ స్టంట్ కొరియోగ్రాఫర్ ఆండి లాంగ్ యాక్షన్ సన్నివేశాలను పర్యవేక్షిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
స్రవంతి చొక్కారపు.. చీరకట్టులో ఎంత అందంగా ఉందో!
అందుకే చిరు.. ‘ఠాగూర్’ సినిమాపై రాజశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘పెద్ది’ రిలీజ్ డేట్.. మరోసారి ‘లెనిన్’ త్యాగం చేయాల్సిందేనా!