Oscar Award: . ప్రేక్షకుల ఆదరణ నుంచి ఆస్కార్ రేసు వరకు.. ‘రామాయణ’ మరో అడుగు!
ABN , Publish Date - Nov 11 , 2026 | 10:35 AM
రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణ’ (Ramayana) మరో అరుదైన ఘనత సాధించే దిశగా అడుగులు వేస్తోంది.
రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణ’ (Ramayana) మరో అరుదైన ఘనత సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్రేక్షకుల ఆదరణతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తున్న ఈ సినిమా ఇప్పుడు ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచేందుకు సిద్ధమవుతోంది. 99వ అకాడమీ (Oscar awards) అవార్డుల పరిశీలన కోసం చిత్ర నిర్మాతలు ‘రామాయణ’ను పంపించినట్లు తెలిసింది. అయితే ఆస్కార్‌కు భారత్ తరఫున అధికారికంగా ఎంపికైన సినిమాతో పాటు, అకాడమీ నిర్దేశించిన అర్హతలను పూర్తి చేసిన ఇతర చిత్రాలు కూడా వివిధ విభాగాల్లో స్వతంత్రంగా పోటీ పడేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నిబంధనల ప్రకారమే ‘రామాయణ’ను ఆస్కార్ పరిశీలనకు పంపించినట్లు తెలుస్తోంది.
మరోవైపు 99వ ఆస్కార్ అవార్డుల అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో భారత్ తరఫున మరాఠీ చిత్రం ‘గోంధల్’ అధికారికంగా ఎంపికైంది. టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్లాట్‌ఫామ్ అవార్డును గెలుచుకున్న ‘అంఘ్’ కూడా ఇదే విభాగంలో పరిశీలనకు అర్హత సాధించింది. ఇక నవంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రామాయణ’ బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.663 కోట్ల వసూళ్లను సాధించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఆస్కార్ బరిలో ఈ చిత్రం ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటుందో చూడాలి.
ALSO READ:
మూడోసారి విడాకులు?.. పవన్ కళ్యాణ్ మరో యుద్ధం చేయాల్సిందే
సూర్య నెక్ట్స్ ప్రాజెక్ట్‌కు టైటిల్ ఫిక్స్.. మరో హిట్ రాసిపెట్టుకోండమ్మా
విజయ్ సేతుపతి జైత్రయాత్ర.. వరుస రిలీజ్‌లతో ఫుల్ బిజీ