Ramayana Twitter X Review: రామాయణ ట్విట్టర్ ఎక్స్.. రివ్యూ! టాక్.. ఇలా ఉందేంటి
ABN , Publish Date - Nov 05 , 2026 | 11:43 AM
సుధీర్ఘ ఎదురుచూపులకు శుభం పలుకుతూ ఎన్నో అంచనాల నడుమ సుమారు 50 వేలకు పైగా రికార్డు స్క్రీన్లలో రామాయణ పార్ట్ చిత్రం విడుదలైంది.
సుధీర్ఘ ఎదురుచూపులకు శుభం పలుకుతూ ఎన్నో అంచనాల నడుమ సుమారు 50 వేలకు పైగా రికార్డు స్క్రీన్లలో రామాయణ పార్ట్ (Ramayana: Part 1) చిత్రం విడుదలైంది. రణబీర్ కపూర్ (Ranbir Kapoor), సాయి పల్లవి (Sai Pallavi), యశ్, సన్నీ డియోల్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ గర్వాల్ , వివేక్ ఒబెరాయ్ వంటి భారీ తారాగణంతో అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కిన ఈ చిత్రం గురువారం ఉదయం ఆటతో థియేటర్లలోకి వచ్చేసింది. దాదాపు 4 వేట కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా తొలి భాగం ఇప్పుడు విడుదల కాగా రెండో భాగం వచ్చే ఏడాది ప్రేక్షకుల ఎదుటకు రానుంది.
ఇప్పటికే ఓ రోజు ముందుగానే అమెరికాలో విడుదలైన ఈ సినిమాను అనేక మంది చూసి తమదైన శైలిలో తమ రివ్యూలను ఇస్తూ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. 3 గంటల 15 నిమిషాల భారీ నిడివితో సినిమా ఉందని, మూవీ బడ్జెట్‌కు తగిన విధంగానే గ్రాండియర్‌గా న భూతో నభవిష్యత్ అనేలా ఉందని అంటున్నారు. అయితే సినిమా ఆరంభమే రావణుడి పాత్ర నుంచి మొదలు పెట్టి ఆ పాత్రతోనే తొలి భాగాన్ని ముగించారని చెబుతున్నారు. అయితే.. సినిమా స్టార్ట్ అయిన 40 నిమిషాల తర్వాతే రాముడి పాత్ర ఆగమనం ఉందని ఆ పాత్రలో రణభీర్ అందంగా ఫర్ఫెక్ట్గా సెట్ అయ్యాడని అంటున్నారు. సీత పాత్రలో సాయి పల్లవి తొలుత రాణి పాత్ర పరిధి తక్కువగానే ఉన్నా ఆరణ్య వాసం మొదలు పాత్ర ఔన్నత్యం అంతకంతకూ పెరిగి పోయిందని పేర్కొంటున్నారు.
ఇక శూర్ఫణఖ పాత్రలో రకుల్ ఆమె భర్త విద్యుత్ జీవ పాత్రలో వివేక్ ఒబెరాయ్ మెప్పించారని అంతేగాక శూర్ఫణఖ పాత్ర నిడివి సైతం 30 నిమిషాలు ఉందని అంటున్నారు. లక్ష్మణుడి పాత్రకు కామెడీ టచ్ ఇచ్చారని, కొన్ని పాత్రలను వక్రీకరించారని చెబుతున్నారు. అయితే.. రామాయణంలోని మొత్తం 7 కాండాలకు గాను తొలి మూడు కాండాలను సినిమాలో చూపించారని జఠాయివు పాత్ర రాకతో ముగించారని చివరిలో హనుమంతుడి పాత్రను ప్రవేశ పెట్టారని పోస్టులు పెడుతున్నారు. ఇక చిత్రంలో రెండు పాటలు ఉన్నాయని కానీ రెహమాన్ (AR Rahman), హెన్స్ జిమ్మర్ వంటి లెజెండ్స్ పని చేసినా సంగీతం అనుకునే స్థాయిలో లేదని పెదవి విరుస్తున్నారు.
మొత్తంగా చూస్తే నిడివి ఎక్కువగా ఉండడం చాలా సన్నివేశాలు మరీ సాగదీసినట్టుగా ఉండడం మూవీకి మైనస్ అని అంటున్నారు. ఇక యుద్ద సన్నివేశాలు మాత్రం గూస్ బంప్స్ వచ్చేలా ఉన్నాయని, రావణుడిగా యశ్ అదరగొట్టాడని కొనియాడుతున్నారు. మరొ కొందరైతే ఈ సినిమాలో రావణ పాత్ర హైలెట్ కావడంతో ఈ తొలి భాగానికి రామాయణ అనే బదులు రావణ అని పేరు పెడితే బావుండేడని కామెంట్లు చేస్తున్నారు. ఇదిలాఉంటే ఈ సినిమాను ఇతర వెర్షన్లలో సినిమా నిడివిని అర గుంట కుదించి 2 గంటల 45 నిమిషాలతో రిలీజ్ చేసినట్లు చెప్పారు. ఇంకా చాలా ప్రాంతాలలో సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది.