సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

David Reddy: మరో పవర్‌ఫుల్‌ రోల్‌లో రమ్యకృష్ణ

ABN, Publish Date - Sep 15 , 2026 | 12:20 PM

'బాహుబలి'లో శివగామి పాత్ర తర్వాత మరో పవర్ ఫుల్ రోల్ చేస్తున్నారు రమ్య కృష్ణ. 

'బాహుబలి'లో శివగామి పాత్ర తర్వాత మరో పవర్ ఫుల్ రోల్ చేస్తున్నారు రమ్య కృష్ణ(Ramya Krishna). మంచు మనోజ్  హీరోగా నటిస్తున్న 'డేవిడ్ రెడ్డి' (David Reddy)చిత్రంలో ఆమె కమల రెడ్డిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తున్నారు. వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్, ట్రూ రాడిక్స్ బ్యానర్ పై వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి నిర్మిస్తున్నారు. బ్రిటీష్ కాలం నాటి బ్యాక్ డ్రాప్ తో ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మారియా ర్యాబోషప్క హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడలో ఈ సినిమా రూపొందుతోంది. 

మంగళవారం రమ్యకృష్ణ బర్త్ డే సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.  కమలా రెడ్డిగా ఆమె లుక్  పవర్ ఫుల్ గా ఉంది.  ఆమె ఖడ్గంతో శత్రువులను తుదముట్టించి తన ఆసనంపై కూర్చుని ఫెరోషియస్ లుక్ లో ఆకట్టుకుంటున్నారు. రమ్యకృష్ణ కెరీర్ లో  కమలా రెడ్డి  పాత్ర ఐకానిక్ క్యారెక్టర్ గా గుర్తుండిపోనుందని మేకర్స్ చెబుతున్నారు.  

ఇవి కూడా చదవండి!

OTT This Week: ఈ వారం.. ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు

Biggboss 10: బిగ్‌బాస్‌-10లో బిగ్‌ ఫైట్‌.. షాలినీపై నరేశ్‌ ఫైర్‌.. వర్షిణితోనూ వార్‌

Rambola: ‘హనుమాన్‌ అంశ్‌’ దర్శకుడి నెక్స్ట్‌ మూవీ..

Updated Date - Sep 15 , 2026 | 12:56 PM