సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Dil Raju: డిస్ట్రిబ్యూటర్‌గా మళ్లీ పుంజుకునేందుకు దిల్‌ రాజు మాస్టర్‌ ప్లాన్‌!

ABN, Publish Date - Oct 10 , 2026 | 11:13 AM

ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ దిల్‌ రాజుకు (Dil Raju) ఈ ఏడాది పంపిణీదారుడిగా ఆశించిన ఫలితాలు దక్కలేదు. భారీ అంచనాలతో విడుదల చేసిన పలు చిత్రాలు నిరాశపరచడంతో ఆయనకు ఎదురుదెబ్బలు తగిలాయి.

ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ దిల్‌ రాజుకు (Dil Raju) ఈ ఏడాది పంపిణీదారుడిగా ఆశించిన ఫలితాలు దక్కలేదు. భారీ అంచనాలతో విడుదల చేసిన పలు చిత్రాలు నిరాశపరచడంతో ఆయనకు ఎదురుదెబ్బలు తగిలాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు తన తదుపరి భారీ ప్రాజెక్ట్‌పై దృష్టి సారించారు. అదే రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి, యశ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణం’ (Ramayana). ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో విడుదల చేసేందుకు దిల్‌ రాజు సిద్ధమవు తున్నారని తెలిసింది. 

టాక్సిక్‌ తర్వాత భారీ ఆశలు..

ఈ ఏడాది ‘టాక్సిక్‌’తో సినిమాతో దిల్ రాజుకు తీవ్ర నష్టం వాటిల్లింది. దానితో ఇప్పుడు ‘రామాయణం’ దిల్‌ రాజుకు కీలకంగా మారింది.  దక్షిణాదికి చెందిన థియేట్రికల్‌ హక్కులు యశ్‌ వద్ద ఉండటంతో, తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసే బాధ్యతలను దిల్‌ రాజు కు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు సాధిస్తే, డిస్ట్రిబ్యూటర్‌గా దిల్‌ రాజుకు మళ్లీ మంచి ఊపు వచ్చే అవకాశం ఉంది.

పాన్‌ ఇండియా ఎపిక్‌!

నితేశ్‌ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణం’ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్‌ రావణుడిగా కనిపించనున్నారు. సన్నీ డియోల్‌, అనుపమ్‌ ఖేర్‌, కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, వివేక్‌ ఒబెరాయ్‌, కునాల్‌ కపూర్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నమిత్‌ మల్హోత్రా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మొదటి భాగం నవంబర్‌ 5న విడుదల కానుండగా, నవంబర్‌ 4న పెయిడ్‌ ప్రీమియర్లు నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో థియేటర్ల సంఖ్య, విడుదల స్థాయి విషయంలో ఆయన భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు టాలీవుడ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ALSO READ:
త్రివిక్రమ్ బలవంతంగా స్టేట్‌మెంట్ ఇప్పించాడు.. పూనమ్ కౌర్ సంచలన వ్యాఖలు

వారణాసి తరువాత మహేష్ అతనితోనే.. పక్కా

Arjun Sarja: అర్జున్‌ ఇంట పెళ్లి సందడి.. 13 ఏళ్ల ప్రేమకు త్వరలో శుభం కార్డు!



Updated Date - Oct 10 , 2026 | 12:08 PM