Arjun Sarja: అర్జున్‌ ఇంట పెళ్లి సందడి.. 13 ఏళ్ల ప్రేమకు త్వరలో శుభం కార్డు!

ABN , Publish Date - Oct 10 , 2026 | 09:59 AM

సీనియర్‌ నటుడు, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ నివాసంలో మళ్ళీ పెళ్ళి బాజాలు మోగనున్నాయి.

సీనియర్‌ నటుడు, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ (Arjun Sarja) నివాసంలో మళ్ళీ పెళ్ళి బాజాలు మోగనున్నాయి. ఈ నెల 18న అర్జున్‌ చిన్న కుమార్తె అంజన (Anjana) తన చిరకాల ప్రియుడిని వివాహమాడనున్నారు. సాయి - అంజన 13 యేళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరి నిశ్చితార్థం తాజాగా ఇటలీలోని కోమో సరస్సు తీరంలో జరిగింది. అలాగే, వీరి వివాహం కూడా కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో నిరాడంబరంగా, ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌లా జరుగనుంది. 

Arjun sarja

ఇక అంజన విషయానికొస్తే, తన అక్క ఐశ్వర్యల కాకుండా, ఆమెకు సినిమా రంగంపై పెద్దగా ఆసక్తి చూపలేదు. విదేశాల్లో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు పూర్తి చేసి, ప్రస్తుతం ఫ్యాషన్‌, వ్యవస్థాపక రంగాలపై దృష్టిసారించారు. ముఖ్యంగా మొక్కల నుంచి లభించే సహజ ముడి పదార్థాలను ఉపయోగించి పర్యావరణ అనుకూల హ్యాండ్‌బ్యాగ్‌లు తయారు చేసే కంపెనీ నడుపుతుండటం గమనార్హం. కాగా, అర్జున్‌ పెద్ద కుమార్తె ఐశ్వర్యను సీనియర్‌ నటుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతితో వివాహం జరిపించిన విషయం తెల్సిందే.

ALSO READ:
త్రివిక్రమ్ బలవంతంగా స్టేట్‌మెంట్ ఇప్పించాడు.. పూనమ్ కౌర్ సంచలన వ్యాఖలు

వారణాసి తరువాత మహేష్ అతనితోనే.. పక్కా



Updated Date - Oct 10 , 2026 | 10:42 AM