రమాప్రభ జీవితం పుస్తకంగా.. ‘ఇదేనండి నా కథ’ ఆవిష్కరణ

ABN , Publish Date - Oct 06 , 2026 | 09:35 AM

ప్రముఖ నటి రమాప్రభ జీవిత కథ ‘రమాప్రభ... ఇదేనండి నా కథ’ పేరుతో పుస్తకంగా వెలువడింది. ఆమె 81వ జన్మదినం సందర్భంగా మదనపల్లెలో పుస్తకాన్ని ఆవిష్కరించారు.

Ramaprabha Book Release

ప్రముఖ నటి రమాప్రభ జీవిత కథ పుస్తకరూపంలో వెలువడింది. తెలుగు సినిమా స్వర్ణయుగాన్ని చవిచూసిన రమాప్రభ ప్రస్తుతం సినిమా రంగానికి దూరంగా మదనపల్లెలో ఉంటున్నారు. ఎప్పుడో గానీ సినిమాలు చేయడం లేదు. వీలైనంత వరకూ ఆధ్యాత్మక జీవితాన్ని గడపడానికే ఆమె ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఎంతో నిరాడంబర జీవితాన్ని గడుపుతున్న రమాప్రభ నటిగా ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూశారు. అలానే వ్యక్తిగతంలోనూ ఎన్నో చేదు అనుభవాలను, తీపి జ్ఞాపకాలను పొందారు. ఇటీవలి కాలంలో సినిమా రంగానికి చెందిన క్యారెక్టర్ ఆర్టిస్టుల జీవిత కథలు సైతం పుస్తకాలుగా వచ్చాయి. నటులు హరనాథ్‌, నాగభూషణం, రమణారెడ్డి తదితరుల పుస్తకాలు ఈ మధ్యనే వెలుగు చూశాయి. తాజా ఇప్పుడు ఆ వరుసలోకి రమాప్రభ జీవిత కథ కూడా చేరింది.


అక్టోబర్ 5వ తేదీ రమాప్రభ పుట్టిన రోజు. ఆమె 81వ జన్మదినం సందర్భంగా అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలోని బసినకొండ పంచాయితీ గంగన్న గారి పల్లెలోని ఆమె స్వగృహంలో ఆమె జన్మదిన వేడుకలను స్థానిక ప్రముఖులు, అభిమానులు నిర్వహించారు. ఈ సందర్భంగా 'రమాప్రభ... ఇదేనండి నా కథ' అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని స్థానిక డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు జింకల మోహనవల్లి రాశారు. ఈ పుస్తకావిష్కరణలో రమాప్రభ మాట్లాడుతూ, 'అందరూ వారి ఆత్మకథలు రాసుకుంటారు.. కాని నా జీవిత కథను మోహనవల్లి రచించడం ఆనందంగా ఉంది' అన్నారు. రచయిత్రి మోహనవల్లి ఈ పుస్తక రచన గురించి చెబుతూ, 'ఏడాది పాటు రమాప్రభగారిని ఒప్పించి ఆమె జీవిత కథను పుస్తకంగా తీసుకువచ్చాను. ఆమె పుట్టిన రోజున ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉంది' అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నవలా రచయిత టీఎస్ఏ కృష్ణమూర్తి, యడవల్లి భారతి, మరసం అధ్యక్ష, కార్యదర్శులు పి. ప్రసాద్‌, యుగంధరాచారి, రామ్మోహన్‌ నాయుడు, డాక్టర్ రాధిక, ఖాజావలి, ఏపీడీ చందన, రమాప్రభ అభిమానులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి:

‘డ్రాగన్’ భారీ షెడ్యూల్.. ఎన్టీఆర్ రీఎంట్రీ అక్కడేనా?

నెట్‌ఫ్లిక్స్‌లో అన్న - అమెజాన్‌లో తమ్ముడు.. దుమ్మురేపుతున్నారు

డీప్‌ఫేక్‌లు, ఆన్‌లైన్ వేధింపులపై విష్ణు మంచు కీలక నిర్ణయం

Updated Date - Oct 06 , 2026 | 09:39 AM

Mahima Nambiar: ‘కామ్రేడ్ కళ్యాణ్’పై మహిమా నంబియార్ ఆసక్తికర వ్యాఖ్యలు

‘కాకా’ మూవీకి గట్టి విలనే దొరికాడుగా..

అస్సలు గుర్తుపట్టలేని స్థితిలో సూర్య డైరెక్టర్.. అంతగా ఏమైంది

Naga Vamsi: క్షమించండి.. ఆ భయంతోనే వాయిదా వేశాం

గరివిడి లక్ష్మీ తెలుసా.. ఎంత బావుంది ట్రైలర్