గరివిడి లక్ష్మీ తెలుసా.. ఎంత బావుంది ట్రైలర్

ABN , Publish Date - Oct 05 , 2026 | 09:19 PM

అచ్చ తెలుగు అందం ఆనంది (Anandi) ప్రధానపాత్రలో గౌరి నాయుడు జమ్ము దర్శకత్వం వహించిన చిత్రం గరివిడి లక్ష్మీ (Garividi Lakshmi)

Garividi Lakshmi

అచ్చ తెలుగు అందం ఆనంది (Anandi) ప్రధానపాత్రలో గౌరి నాయుడు జమ్ము దర్శకత్వం వహించిన చిత్రం గరివిడి లక్ష్మీ (Garividi Lakshmi) . జానపద కళారంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న గరివిడి లక్ష్మీ జీవితకథగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఇక ఈ సినిమాలో అంకిత్ కొయ్య, రాగ్ మయూర్, శరణ్య ప్రదీప్, నరేష్, రాశి పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా గరివిడి లక్ష్మీ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.


మగవారి ఆధిపత్యం నడిచే సాంప్రదాయ బుర్రకథ,జానపద కళారంగంలో ఒక సామాన్య మహిళ చేసిన అద్భుత పోరాటమే ఈ చిత్రం. ఉత్తరాంధ్ర మారుమూల గ్రామంలో పుట్టిన లక్ష్మి (ఆనంది) తన అపూర్వమైన గొంతుతో, బుర్రకథ పాటతో సమాజంలోని అన్యాయాలపై గళం విప్పుతుంది. కళను ఆయుధంగా మలచుకుని గ్రామాల్లో జానపద పునర్వైభవాన్ని తెచ్చిన ఆమె ప్రయాణంలో ఎదురైన ఆటంకాలు ఏంటి.. ? ఆమె కనిపించకుండా ఎక్కడికి వెళ్లిపోయింది..? ఆమె జీవితంలో జరిగిన సంఘటనలు ఏంటి అనేది తెరమీదనే చూడాలి.


ట్రైలర్‌లో ఎమోషన్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఆనంది నటన, చరణ్ అర్జున్ అందించిన జానపద బాణీలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విజువల్స్‌ను వేరే లెవెల్‌కి తీసుకెళ్లాయి. గరివిడి లక్ష్మీగా ఆనంది ఒదిగిపోయింది. ట్రైలర్ కట్ చేసిన విధానం చాలా బావుంది. ఇప్పటి జనరేషన్ కి తెలియని ఒక కళాకారిణి గురించి అందరికీ తెలియాలని మేకర్స్ తీసుకున్న నిర్ణయం ఎంతో ఆదర్శనీయమని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. అక్టోబర్ 17 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Updated Date - Oct 05 , 2026 | 09:19 PM