టాలీవుడ్లో ‘జైలర్ 2’ హిస్టరీ.. ఫస్ట్ కోలీవుడ్ ఫిల్మ్‌గా రికార్డ్
ABN, Publish Date - Oct 25 , 2026 | 07:45 PM
బాక్సాఫీస్ వద్ద సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రభంజనం ఏమాత్రం తగ్గడం లేదు. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘జైలర్ 2’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల సునామీ సృష్టిస్తోంది.
బాక్సాఫీస్ వద్ద సూపర్‌స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth) ప్రభంజనం ఏమాత్రం తగ్గడం లేదు. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘జైలర్ 2’ (Jailer 2) బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన కేవలం 10 రోజుల్లోనే ఏకంగా రూ. 675 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించిన ఈ చిత్రం.. ముఖ్యంగా తెలుగు నాట ఇప్పటి వరకు ఏ కోలీవుడ్ (Kollywood) సినిమాకు లేని సరికొత్త చరిత్రను లిఖించింది.
తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు నుంచే అద్భుతమైన ఆదరణ దక్కించుకున్న ‘జైలర్ 2’.. కేవలం 10 రోజుల్లోనే తెలుగు వెర్షన్లో ఏకంగా రూ. 100 కోట్ల గ్రాస్ మార్కును దాటేసింది. ఇప్పటివరకు టాలీవుడ్లో డబ్ అయిన ఏ తమిళ చిత్రానికి కూడా ఈ స్థాయి కలెక్షన్లు సాధ్యపడలేదు. గతంలో ఇతర భాషల నుంచి వచ్చి తెలుగులో రూ. 100 కోట్ల క్లబ్లో చేరిన చిత్రాల జాబితాలో కేవలం ‘కేజీఎఫ్ 2’, ‘కాంతార చాప్టర్ 1’, ‘అవతార్ 2’, ‘ధురంధర్ 2’ మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఆ అరుదైన మైలురాయిని అందుకున్న మొట్టమొదటి తమిళ చిత్రంగా రజనీకాంత్ ‘జైలర్ 2’ సరికొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది.
ప్రస్తుతం థియేటర్లలో ‘జైలర్ 2’కు దీటైన పోటీ ఇచ్చే పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో కలెక్షన్ల జోరు మరింత బలంగా కొనసాగుతోంది. మాస్, క్లాస్ తేడాలేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తుతుండటంతో.. ఫుల్ రన్ ముగిసే సమయానికి తెలుగు వెర్షన్ ఏకంగా రూ. 125 కోట్ల వరకు గ్రాస్ రాబట్టవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ వయసులోనూ తన స్వాగ్, మేనియాతో రజనీకాంత్ సృష్టిస్తోన్న ఈ రికార్డులను చూసి సినీ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి.
ఇవి కూడా చదవండి:
ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన విశ్వక్ సేన్.. ఎందుకంటే?
నాని ‘ద ప్యారడైజ్’కు.. మహేష్ తనయుడు ఇచ్చిన రేటింగ్ ఎంతో తెలుసా?
‘జనవరి 12 విడుదల’ షాకింగ్ బిజినెస్.. మరో బ్లాక్‌బస్టర్ పక్కానా?