ఐకాన్ స్టార్ ‘రాకా’ రిలీజ్ పై మళ్లీ సస్పెన్స్..!
ABN, Publish Date - Sep 12 , 2026 | 02:58 PM
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాసేందుకు సిద్ధమవుతున్న మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్‌లలో ‘రాకా’ చిత్రం ముందు వరుసలో ఉంటుంది. ఈ సినిమా రిలీజ్‌కు సంబంధించి ఇప్పుడో వార్త వైరల్ అవుతోంది.
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాసేందుకు సిద్ధమవుతున్న మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్‌లలో ‘రాకా’ (Raaka) చిత్రం ముందు వరుసలో ఉంటుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun), కమర్షియల్ మాంత్రికుడు అట్లీ (Atlee) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న ఫాంటసీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రాకా’ గురించి వస్తోన్న లేటెస్ట్ అప్‌డేట్ ఫ్యాన్స్‌కు కాస్త నిరాశ కలిగించేలా ఉంది. ఇప్పటికే ఈ సినిమాపై నెలకొన్న హైప్ సాధారణమైనది కాదు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఏకంగా రూ.800 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్‌లో దీపికా పదుకొణె, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నా, జాన్వీ కపూర్ వంటి నలుగురు స్టార్ హీరోయిన్లు నటిస్తుండగా.. హాలీవుడ్ లెజెండరీ యాక్టర్ విల్ స్మిత్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక అల్లు అర్జున్ ఈ చిత్రంలో ఏకంగా మూడు విభిన్న పాత్రల్లో విశ్వరూపం చూపించనున్నారని తెలుస్తోంది. ఏడాదికి పైగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంపై అంచనాలు రోజురోజుకు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. సినిమా షూటింగ్ మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ఒక్క న్యూస్ కూడా బయటకు రాకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎన్నో అంచనాలతో తెరకెక్కుతోన్న ‘రాకా’, మొదట ఈ ఏడాది చివరినాటికి షూటింగ్ ముగించి, వచ్చే ఏడాది డిసెంబర్‌లో థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ, తాజాగా వినిపిస్తున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ విజువల్ వండర్ 2027లో కాకుండా 2028 సమ్మర్‌కు వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం వెనుక అసలు కారణం విజువల్ ఎఫెక్ట్స్‌పై అట్లీ చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధే అని అంటున్నారు.
సినిమాలోని విఎఫ్‌ఎక్స్ సన్నివేశాలు హాలీవుడ్ రేంజ్‌లో ఉండేలా చూసేందుకు ప్రపంచ స్థాయి టాప్ విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియోస్ పనిచేస్తున్నాయి. ఆ గ్రాఫిక్ వర్క్ కోసమే భారీ సమయం కేటాయించాల్సి వస్తుండటంతో ‘రాకా’ యూనిట్ ఈ నిర్ణయాన్ని తీసుకుందట. వచ్చే ఏడాది వేసవి నాటికి షూటింగ్ మొత్తం పూర్తి చేసి, మిగిలిన సమయం పూర్తి స్థాయిలో పోస్ట్ ప్రొడక్షన్‌కే కేటాయించాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారట. ఆల్రెడీ రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంటర్నెట్‌ను షేక్ చేయగా, బన్నీ అభిమానులు ఆ లుక్‌ను చూసి పిచ్చెక్కిపోయారు. ఈ లెక్కన చూస్తే, బ్లాక్‌బస్టర్ ‘పుష్ప 2’ వచ్చిన సుమారు నాలుగేళ్ల తర్వాత ఐకాన్ స్టార్ నుంచి రాబోతున్న మరో భారీ సినిమా ‘రాకా’ మాత్రమే కానుంది. ఈ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోన్న తీరు చూస్తుంటే ఇండియన్ సినిమా హిస్టరీలో మరో సరికొత్త రికార్డ్ క్రియేట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది!
ఇవి కూడా చదవండి:
ఓటీటీలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సంచలనం.. టైమింగ్ అదిరింది
70 ఏళ్ల వయసొచ్చినా.. నచ్చితే రెండో పెళ్లి చేసుకుంటా: ప్రేమ
‘వారణాసి’ కీలక అప్‌డేట్.. ఇంత స్పీడ్ ఏంటి జక్కన్నా?