ఓటీటీలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సంచలనం.. టైమింగ్ అదిరింది

ABN , Publish Date - Sep 12 , 2026 | 02:26 PM

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో, క్లాసిక్ ఫిల్మ్ మేకర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన మనసుకు హత్తుకునే ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. ఈ సినిమా ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది.

Vishwanath and Sons OTT

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) ప్రధాన పాత్రలో, క్లాసిక్ ఫిల్మ్ మేకర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన మనసుకు హత్తుకునే ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ . సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పించింది. ఆగస్ట్ 14న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా అలరించి బాక్సాఫీస్ వద్ద రూ. 250 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో ఇండస్ట్రీ హిట్ స్థాయి విజయాన్ని నమోదు చేసుకుంది. క్రేజీ హీరోయిన్ మమితా బైజు (Mamitha Baiju) కథానాయికగా మెప్పించిన ఈ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. తాజాగా థియేట్రికల్ రన్ ముగించుకుని డిజిటల్ తెరపైకి (Vishwanath and Sons OTT) అడుగుపెట్టింది.


ప్రముఖ అంతర్జాతీయ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా సెప్టెంబర్ 11 నుంచి ఈ చిత్రం తెలుగు, తమిళంతో పాటు పలు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో బ్లాక్‌బస్టర్ అయిన ఈ సినిమాకు డిజిటల్ ప్రీమియర్‌లోనూ కనీవినీ ఎరుగని రెస్పాన్స్ దక్కుతోంది. విడుదలైన కొద్ది గంటల్లోనే భారీ వ్యూవర్‌షిప్‌ను సొంతం చేసుకుంటూ నెట్‌ఫ్లిక్స్ ఇండియా ట్రెండింగ్ చార్ట్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది.


ముఖ్యంగా ఈ చిత్ర ఓటీటీ రిలీజ్‌కు పర్ఫెక్ట్ టైమింగ్ కుదిరిందనే చెప్పాలి. శుక్రవారం స్ట్రీమింగ్‌కు రావడం, ఆ వెంటనే శనివారం, ఆదివారం వీకెండ్‌తో పాటు సోమవారం వినాయక చవితి పండుగ సెలవు కలిసి రావడంతో కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమాను ఇంట్లోనే వీక్షించేందుకు ఎగబడుతున్నారు. వరుసగా వచ్చిన ఈ మూడు నాలుగు రోజుల లాంగ్ హాలిడేస్‌ను సినిమా పర్ఫెక్ట్‌గా క్యాష్ చేసుకుంటోంది. థియేటర్లలో మిస్సయిన సినీ ప్రియులతో పాటు, మరోసారి ఈ అందమైన ఫ్యామిలీ డ్రామాను చూడాలనుకున్న వారు ఓటీటీలో స్ట్రీమ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మొత్తానికి అటు బాక్సాఫీస్‌తో పాటు ఇటు ఓటీటీలోనూ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తిరుగులేని సంచలనం సృష్టిస్తోంది.

ఇవి కూడా చదవండి:

70 ఏళ్ల వయసొచ్చినా.. నచ్చితే రెండో పెళ్లి చేసుకుంటా: ప్రేమ

‘వారణాసి’ కీలక అప్‌డేట్.. ఇంత స్పీడ్ ఏంటి జక్కన్నా?

TFTDDA: జానీ మాస్టర్ వైఫ్ సుమలత స్కెచ్ అదిరిందిగా.. కోర్టు సంచలన తీర్పు

Updated Date - Sep 12 , 2026 | 02:26 PM