Priyadarshi: 'ది ప్యారడైజ్’లో ఎమ్మెల్యే శంకర్‌గా ప్రియదర్శి.. వీడియోలు వైరల్

ABN , Publish Date - Sep 24 , 2026 | 01:37 PM

నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’  గురువారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’  గురువారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమా యాక్షన్‌ అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.  ఈ  సినిమాలో  ఎమ్మెల్యే శంకర్ గా ప్రియదర్శి కీలక పాత్ర పోషించారు.  ఆ పాత్ర, మేనరిజమ్స్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో  వైరల్ గా మారుతున్నాయి. ఈ క్యారెక్టర్‌లో ప్రియదర్శి తెలంగాణ రాజకీయ వాతావరణాన్ని ప్రతిబింబించేలా తన యాక్టింగ్‌తో ఆకట్టుకున్నారని ప్రేక్షకుల నుంచి కామెంట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఇందులో ప్రియదర్శి పాత్ర తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పోలి ఉందని, హావభావాలు, మాట్లాడే విధానం ఆయనలాగే  ఉందని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.  ఇవన్నీ కూడా  ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దీంతో సినిమా చూసిన కొందరు ప్రేక్షకులు ఆయన పాత్రకు సంబంధించిన సన్నివేశాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

 

 ఇవి కూడా చ‌ద‌వండి

రామ్ చరణ్-సుకుమార్ RC17పై క్రేజీ అప్‌డేట్

‘జార్జ్ క్రిష్’ బిగ్ అప్‌డేట్.. హీరోయిన్‌గా మిస్ ఇండియా ఫిక్స్

హీరోయిన్ కాదు.. రాకాలో రష్మికకు భారీ ట్విస్ట్?

రూ.5 లక్షల మోసం.. బిగ్‌బాస్ వర్షిణి అరెస్టు

మామ కోసం అల్లుడి త్యాగం.. రేసు నుంచి త‌ప్పుకున్న ఓం

యంగ్‌ లుక్‌లో మహేశ్‌?.. ‘వారణాసి' షూటింగ్ పూర్తి

Ambika: నేను నోరు తెరిస్తే.. రాధ జైలుకే

Updated Date - Sep 24 , 2026 | 01:39 PM