బాలయ్య హీరోయిన్‌కు అవకాశాలు కరువు.. కారణం అదేనా?
ABN, Publish Date - Apr 26 , 2026 | 09:18 AM
కొంతమందికి హిట్లు లేకపోయినా వరుసగా అవకాశాలు వస్తుంటాయి. కానీ, మరికొంతమందికి బ్లాక్ బస్టర్ హిట్లు పడినా అదృష్టం మాత్రం తలుపు తట్టదు. ప్రస్తుతం సరిగ్గా ఇలాంటి డైలమాలోనే ఉంది టాలీవుడ్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్.
సినీ గ్లామర్ ప్రపంచంలో మెరుపు తీగల్లా మెరిసిపోయే హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువ. ఇక్కడ సక్సెస్ ఉంటేనే క్రేజ్.. క్రేజ్ ఉంటేనే ఆఫర్లు. అందుకే చిన్న హీరోయిన్ నుంచి స్టార్ స్టేటస్ ఉన్న భామల వరకు వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేసేందుకు తపిస్తుంటారు. అయితే ఇక్కడో విచిత్రమైన పరిస్థితి ఉంది. కొంతమందికి హిట్లు లేకపోయినా వరుసగా అవకాశాలు వస్తుంటాయి. కానీ, మరికొంతమందికి బ్లాక్ బస్టర్ హిట్లు పడినా అదృష్టం మాత్రం తలుపు తట్టదు. ప్రస్తుతం సరిగ్గా ఇలాంటి డైలమాలోనే ఉంది టాలీవుడ్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal).
‘మిర్చి లాంటి కుర్రాడు’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ప్రగ్యా, వరుణ్ తేజ్ సరసన నటించిన ‘కంచె’ (Kanche) చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆ సినిమాలో సీతాదేవిగా తన నటనతో, హుందాతనంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ప్రతి ఒక్కరూ గుర్తించేలా ప్రగ్యా తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ‘కంచె’ విజయం తర్వాత ఈమె కెరీర్ జెట్ స్పీడ్‌లో దూసుకుపోతుందని అందరూ భావించారు. కానీ సీన్ కట్ చేస్తే.. ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాలేదు. 2014లో తమిళ ఇండస్ట్రీ ద్వారా సినీ ప్రయాణం మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ, ఇప్పటికీ పుష్కర కాలం పూర్తి చేసుకున్నా.. ఇంకా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తూనే ఉంది. మధ్యలో కొన్ని సినిమాలు చేసినా అవి పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ (Balakrishna) సరసన నటించిన ‘అఖండ’ (Akhanda) సినిమా ప్రగ్యా కెరీర్‌కు పెద్ద ఊపిరి పోసింది. ఆ సినిమాలో కలెక్టర్ పాత్రలో మెప్పించడమే కాకుండా, బాలయ్య సరసన పర్‌ఫెక్ట్ పెయిర్ అనిపించుకుంది. గతేడాది వచ్చిన ‘డాకు మహారాజ్’ (Daaku Maharaj) లోనూ సందడి చేసింది. ఈ క్రమంలో సీనియర్ హీరోలకు ఈమె బెస్ట్ ఛాయిస్ అవుతుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషించాయి. కానీ, ఆ క్రేజ్ ఆఫర్ల రూపంలోకి మారడం లేదు. హిట్ వచ్చినా బిజీ హీరోయిన్‌గా మారలేకపోవడం ప్రగ్యా కెరీర్‌లో పెద్ద మైనస్‌గా మారింది.
సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో ప్రగ్యా తన రూటు మార్చింది. సోషల్ మీడియా వేదికగా గ్లామర్ గాలం వేస్తోంది. గతంలో హోమ్లీగా కనిపించిన ఈ బ్యూటీ, ఇప్పుడు గ్లామర్ డోస్ అమాంతం పెంచేసింది. బాలీవుడ్‌లో అయినా నిలదొక్కుకోవాలని చేస్తున్న ప్రయత్నాలు ఇంకా ఫలితాన్ని ఇవ్వడం లేదు. పొట్టి దుస్తుల్లో, హాట్ ఫోటో షూట్లతో నెట్టింట సెగలు పుట్టిస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్‌లు ఏవీ లేకపోవడంతో, ఈ సోషల్ మీడియా గ్లామర్ షోనే ఆమెకు ఏకైక ఆశగా కనిపిస్తోంది. గ్లామర్‌తో కవ్వించడంలో ప్రగ్యా జైస్వాల్ ఏమాత్రం తగ్గడం లేదు. తన అందచందాలతో మేకర్స్‌ను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. మరి ఈ గ్లామర్ డోస్ పెంచడం వల్ల కొత్త ఆఫర్లు ఏమైనా వస్తాయా? రాబోయే రోజుల్లో ప్రగ్యా మళ్ళీ బిజీ హీరోయిన్ అవుతుందా? అన్నది చూడాలి.
ఇవి కూడా చదవండి:
లెజెండరీ మల్టీస్టారర్ చిత్రాన్ని అలా వదిలేశారేంటి? ఇలా అయితే కష్టమే!
Varanasi: మహేష్ కోసమే ఆ కష్టాలు.. జక్కన్న పక్కా ప్లానింగ్!
స్రవంతి చొక్కారపు.. చీరకట్టులో ఎంత అందంగా ఉందో!
అందుకే చిరు.. ‘ఠాగూర్’ సినిమాపై రాజశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు