సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

లీగల్ వివాదంలో ప్రభాస్ ‘స్పిరిట్’.. టైటిల్ మార్చాల్సిందేనా?

ABN, Publish Date - Jun 24 , 2026 | 01:43 PM

రెబల్ స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ వంగా కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’ ఇప్పుడు లీగల్ కాంట్రవర్సీని ఫేస్ చేయబోతోంది. ‘స్పిరిట్ - ఈజ్ నాట్ వన్’ టీమ్ సీరియస్‌గా రియాక్ట్ అవుతోంది.

Spirit Title Controversy

రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas), సంచలన దర్శకుడు సందీప్ వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’ (Spirit) ఇప్పుడు లీగల్ కాంట్రవర్సీని ఫేస్ చేయబోతోంది. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాగా రానున్న ఈ సినిమా టైటిల్ కాంట్రవర్సీని ఫేస్ చేస్తోంది. కొన్ని రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమా టైటిల్‌కు సంబంధించి వివాదం నడుస్తోన్న విషయం తెలిసిందే. ‘స్పిరిట్ - ఈజ్ నాట్ వన్’ (Spirit Is Not One) అనే చిన్న సినిమా నిర్మించిన నిర్మాతలు.. ప్రభాస్ ‘స్పిరిట్’ టైటిల్‌ విషయంలో పోరాడేందుకు కోర్టు మెట్లు ఎక్కబోతున్నట్లుగా తెలుస్తోంది. నిజంగా అంత దూరం వస్తే మాత్రం.. ప్రభాస్ ‘స్పిరిట్’ చిత్రానికి టైటిల్ మార్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పరిశీలకులు చెబుతున్నారు. అసలు విషయం ఏమిటంటే..


ఒక సామాన్య రైతు కుటుంబానికి చెందిన మహిళా నిర్మాత నరసమ్మ తన గొర్రెలు, మేకలు, ఆస్తులను అమ్మి.. ఎంతో కష్టపడి ‘స్పిరిట్ - ఈజ్ నాట్ వన్’ సినిమాను నిర్మించామని చెబుతున్నారు. ఇందులో నిర్మాత నరసమ్మ తనయుడు రవి హీరోగా నటించారు. సందీప్ రెడ్డి వంగా అండ్ టీమ్ ‘స్పిరిట్’ టైటిల్‌ని రిజిస్టర్ చేయడానికి రెండు నెలల ముందే ‘స్పిరిట్ - ఈజ్ నాట్ వన్’ అనే టైటిల్‌ని ఛాంబర్‌లో అధికారికంగా రిజిస్టర్ చేశామని నిర్మాత నరసమ్మ, హీరో రవి చెబుతున్నారు. అయినా కూడా టీ - సిరీస్ వారు టైటిల్ మాదంటూ.. లీగల్ నోటీసులు పంపించారని, టైటిల్ మార్చమని చెబుతూ.. మా సినిమాను విడుదల కాకుండా అడ్డుపడుతున్నారని ఆరోపిస్తున్నారు. అంతేకాదు, ఈ విషయంలో లీగల్ పోరాటానికి సిద్ధమైనట్లుగా కూడా వారు తెలుపుతున్నారు.


ఈ విషయం తెలిసి మరోమారు మాకు లీగల్ నోటీసు ఇవ్వడానికి వారు సిద్ధమయ్యారని, అయినా మేము వెనక్కి తగ్గేది లేదని హీరో రవి చెబుతున్నారు. ఈ విషయంలో సందీప్ రెడ్డి వంగా మేనేజర్ చాలా దారుణంగా ప్రవర్తించారని ఆయన తెలిపారు. మేము లీగల్‌గా వెళ్లి టీ - సిరీస్ వారిపై కేసు వేస్తే.. ప్రభాస్ ‘స్పిరిట్’‌కు ఇబ్బందులు తప్పవని ఆయన హెచ్చరించారు. ‘ఎయిత్ వండర్ బ్యానర్‌పై ఈ సినిమాను తీశాం.. ఫస్ట్ టైటిల్ రిజిస్టర్ చేయించాం. సెన్సార్ పూర్తై రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న సినిమాకే చట్టపరంగా పూర్తి హక్కులు ఉంటాయి, ఇప్పటికైనా ఈ విషయంలో సందీప్ రెడ్డి వంగా పబ్లిగ్గా మాట్లాడాలి’ అని రవి కోరుతున్నారు. ప్రస్తుతం సెటిల్‌మెంట్ వ్యవహారం నడపాలని కొందరు చూస్తున్నట్లుగా కూడా ఆయన ఆరోపించారు. టీ - సిరీస్ వాళ్లతో కూడా ఈ విషయంలో సందీప్ వంగా బేరసారాలు చేస్తున్నట్లుగా రవి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక చిన్న సినిమాతో పబ్లిసిటీ పొందాలని వంగా చూస్తున్నారని, ఈ విషయం ప్రభాస్ వరకు చేరితే ఆయన బాధపడి, వెంటనే మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నట్లుగా రవి తన తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మరి ఈ వ్యవహరం ఎంత వరకు వెళుతుంది? ప్రభాస్ కలగజేసుకుంటాడా? లేదా? నిజంగా ఈ చిన్న నిర్మాతలు కోర్టు మెట్లు ఎక్కితే.. ప్రభాస్ ‘స్పిరిట్’ టైటిల్ మార్చుకోవాల్సి వస్తుందా? అనే విషయాలు తెలియాలంటే.. ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి:

పీఆర్ స్టంట్స్.. పిక్చర్స్‌కు పనికొచ్చేనా..!

‘పెద్ది’ సక్సెస్ చూసి నాకు ‘ఠాగూర్’‌లోని డైలాగ్ గుర్తొచ్చింది: రామ్ చరణ్

Dharman: తలైవర్ 173 టైటిల్ ఖరారు.. రఫ్పాడించేస్తోన్న ఫస్ట్ లుక్!

Updated Date - Jun 24 , 2026 | 01:43 PM