సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఫౌజీ, ప్యారడైజ్‌.. ఆ తేదీల్లో రావని పుకార్ల షికారు

ABN, Publish Date - Sep 08 , 2026 | 03:13 PM

రెబల్ స్టార్ ప్రభాస్ - న్యాచురల్ స్టార్ నాని మూవీస్ రిలీజ్ డేట్స్ పై అనుమానాలు రేకెత్తిస్తున్నారు నెటిజన్స్. ప్రభాస్ 'ఫౌజీ'- నాని 'ద ప్యారడైజ్' సినిమాల విడుదల తేదీలు ప్రకటించినా, ఆ డేట్స్ లో సినిమాలు రావంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

Paradise - Fauzi Movies

ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి డైరెక్షన్ లో రూపొందుతోన్న 'ఫౌజీ' చిత్రం డిసెంబర్ 3వ తేదీన విడుదల కానుంది. ఇక నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన 'ద ప్యారడైజ్' ఈ నెల 24వ తేదీన రిలీజవుతోంది. అయితే ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్స్ పై పుకార్లు షికారు చేస్తూనే ఉండడం గమనార్హం!. 'ఫౌజీ' చిత్రం మొదట్లో దసరాకు వస్తుందని వినిపించింది. అయితే తరువాత డిసెంబర్ 3వ తేదీన ఈ మూవీ రానుందని చాలా రోజులుగా వినిపిస్తోంది. ఇక 'ద ప్యారడైజ్' మూవీ ఇప్పటికే పలు తేదీలు మారుకుంటూ వస్తోంది. ఇప్పుడు సెప్టెంబర్ 24న పక్కా అనుకుంటూ ఉండగా, ఆ తేదీకీ 'ద ప్యారడైజ్' రాకపోవచ్చు అనే ప్రచారం సాగుతోంది. ఈ రెండు సినిమాలపైనే ఎందుకిలాంటి వార్తలు వస్తున్నాయన్నదే ప్రశ్న! ఈ రెండు చిత్రాలకు ప్రేక్షకుల్లో ఓ క్రేజ్ చోటు చేసుకుంది. పైగా ముందుగా ప్రకటించిన తేదీలను మార్చడం వల్ల ఇలా ఎవరికి వారు ఈ చిత్రాలు అనుకున్న తేదీలకు రావంటూ ప్రచారం సాగిస్తున్నారు. ఎందుకంటే ఇంకా ఈ సినిమాల షూటింగ్ పూర్తి కాలేదనీ అంటున్నారు. ప్రభాస్ 'ఫౌజీ' ఇంకా పూర్తి కాని మాట వాస్తవమే. అయితే నాని 'ద ప్యారడైజ్'పైనా ఇదే ప్రచారం సాగుతూ ఉండడం గమనార్హం.!


ప్రభాస్ 'ఫౌజీ' ప్రకటించిన రిలీజ్ డేట్ డిసెంబర్ 3. అందుకు చాలా సమయం ఉంది. కాబట్టి 'ఫౌజీ' విడుదల తేదీపై పుకార్లు షికార్లు చేస్తూనే ఉంటాయని అనుకోవచ్చు. అయితే నాని 'ద ప్యారడైజ్' మూవీ ఎట్టకేలకు సెప్టెంబర్ 24న వస్తుందని ప్రకటించడమే కాదు, రిలీజ్ కు ముస్తాబవుతోందనీ ట్రేడ్ సర్కిల్స్ సైతం చెబుతున్నాయి. అయినా 'ద ప్యారడైజ్' సెప్టెంబర్ 24న విడుదల కాదని చెప్పడం నిజంగా పుకారుగానే భావించాలి. అలా చెప్పడం వల్ల 'ద ప్యారడైజ్' ఇప్పట్లో రాదులే అని ప్రేక్షకులు భావించే అవకాశం ఉంది. అప్పటికీ చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరి ఇటీవలే 'ద ప్యారడైజ్' సినిమా సెప్టెంబర్ 24న వస్తోందనీ ప్రకటించారు. అయినా డౌట్స్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారో అర్థం కావడం లేదు.


'ద ప్యారడైజ్', 'ఫౌజీ' రెండు చిత్రాలు క్రేజ్ ను సొంతం చేసుకున్నాయి. హను రాఘవపూడి ఇప్పటి దాకా ఐదు సినిమాలు రూపొందించారు. అందులో 'కృష్ణగాడి వీర ప్రేమగాథ', 'సీతారామం' మంచి విజయం సాధించాయి. మిగతా మూడు అంతగా అలరించలేకపోయాయి. ఇప్పుడు ప్రభాస్ 'ఫౌజీ' సినిమా పీరియడ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. నేతాజీ నెలకొల్పిన ఆజాద్ హింద్ ఫౌజ్ లో పాల్గొన్న ఓ వీరుని గాథతో 'ఫౌజీ' రూపొందుతోంది. ఇక 1980 నాటి సికిందరాబాద్ వాతావరణంలో 'ద ప్యారడైజ్' మూవీని తీశారు. ఇంతకు ముందు నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన 'దసరా' అలరించింది. అందువల్ల రెండు సినిమాలపైనా ప్రేక్షకుల్లో ఓ స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. 'ఫౌజీ' చిత్రాన్ని మైత్రీ మూవీమేకర్స్ అధినేతలు రవిశంకర్, నవీన్ నిర్మిస్తున్నారు. 'ద ప్యారడైజ్'కు సుధాకర్ చెరుకూరి నిర్మాత. తమ సినిమాల విడుదల తేదీలపై వస్తోన్న పుకార్లను ఈ మేకర్స్ సమర్థవంతంగా ఎదుర్కోవాలి.లేదంటే అసలు ఆ సినిమాలు ఇప్పట్లో రావని ప్రేక్షకులు డిసైడ్ అయ్యే అవకాశం ఉంది. ముందుగా వచ్చే 'ద ప్యారడైజ్' చిత్రనిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ బ్యాడ్ ప్రాపగాండాను ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

ఇవి కూడా చదవండి:

Hanuman Ansh: ‘హనుమాన్ అంశ్’ గురుకుల విద్యార్థుల సందడి..

Priyanka Chopra: బిగ్‌బాస్‌ 20లో మేరీకోమ్ ఎంట్రీ.. కంటెస్టెంట్లకు ప్రియాంక చోప్రా సరదా వార్నింగ్!

Nagarjuna - DSP: హ్యాట్రిక్‌ ఇచ్చిన డిసెంబర్ మాసం...

Updated Date - Sep 08 , 2026 | 03:52 PM