Hanuman Ansh: ‘హనుమాన్ అంశ్’ గురుకుల విద్యార్థుల సందడి..

ABN , Publish Date - Sep 07 , 2026 | 01:27 PM

బాక్సాఫీస్‌ వద్ద విజయవంతంగా దూసుకెళ్తున్న ‘హనుమాన్ అంశ్’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

Hanuman Ansh Movie

బాక్సాఫీస్‌ వద్ద విజయవంతంగా దూసుకెళ్తున్న ‘హనుమాన్ అంశ్’ (Hanuman Ansh) చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటికే రూ.100 కోట్ల మైలురాయిని దాటి సంచలనం సృష్టిస్తున్న ఈ సినిమాను చూసేందుకు ఢిల్లీలోని గురుకుల విద్యార్థులు (Gurukula students) పెద్ద సంఖ్యలో  పీవీఆర్‌ థియేటర్‌కు తరలివచ్చారు. సంప్రదాయ వస్త్రధారణలో విద్యార్థులు థియేటర్‌లోకి అడుగుపెడుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియో అందరి దృష్టిని ఆకర్షించింది. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతకు సంబంధించిన అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోందని చిత్రబృందం చెబుతోంది.

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను ఆధారంగా చేసుకుని దర్శకుడు విశాల్ చతుర్వేది ‘హనుమాన్ అంశ్’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆధ్యాత్మికత, విశ్వాసం, మానవ విలువలను ప్రధానంగా తీసుకుని రూపొందించిన ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి అనూహ్య విజయాన్ని అందుకుంది. మౌత్ టాక్‌తో  ప్రేక్షకుల్లోకి వెళ్లిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బలమైన వసూళ్లు సాధిస్తోంది. తాజాగా రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరడంతో చిత్రబృందం ఆనందం వ్యక్తం చేస్తోంది.

Updated Date - Sep 07 , 2026 | 02:47 PM