రామ్ చరణ్ గొప్పతనమేంటో చెప్పిన ‘పెద్ది’ నిర్మాత!

ABN , Publish Date - May 01 , 2026 | 10:52 PM

బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో ‘పెద్ది’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ కార్యక్రమంలో రామ్ చరణ్‌పై నిర్మాత ప్రశంసలు కురిపించారు.

Producer Venkata Satish Kilaru about Ram Charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) హీరోగా నటిస్తోన్న రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ (Peddi). ఇప్పటికే రెండు మూడు సార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని, ఫైనల్‌గా జూన్ 4న విడుదల చేయబోతున్నట్లుగా శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ‘రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్’ కార్యక్రమంలో మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. బుచ్చి బాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు (Venkata Satish Kilaru) భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ కార్యక్రమంలో హీరో రామ్ చరణ్‌పై నిర్మాత ప్రశంసలు కురిపించారు.


‘‘రామ్ చరణ్‌కు జీవితకాలం రుణపడి ఉంటాను. నా మొదటి సినిమాగా ఇంత పెద్ద సినిమా చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు ఆయనకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. బుచ్చిబాబు చాలా అద్భుతంగా ఈ సినిమాను తీశారు. రామ్ చరణ్, జాన్వీ కపూర్.. ఇలా అందరూ అద్భుతంగా చేశారు. ప్రేక్షకులందరికీ గుర్తుండిపోయే సినిమా ‘పెద్ది’. తప్పకుండా థియేటర్లకు వచ్చి సినిమాను చూడండి. కమర్షియల్, ఎమోషనల్ రైడ్ ఇది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ థియేటర్స్‌లో చూడగలిగే సినిమా. అవుట్ పుట్ చూశాం.. అద్భుతంగా వచ్చింది. నిర్మాతగా చాలా హ్యాపీగా ఉన్నాను. జూన్ 4న సినిమా రిలీజ్ అవుతోంది. జూన్ 3 ఈవెనింగ్ అన్ని చోట్ల ప్రీమియర్స్ ఉంటాయి.


ఇక ఈ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులూ రామ్ చరణ్‌తో కలిసి భోజనం చేసే అవకాశం దొరికింది. ఆయన ఇంటి నుంచి తీసుకొచ్చిన భోజనం మాకు పెట్టేవారు. ఆ అనుభవం నా జీవితంలో మర్చిపోలేనిది. ఈ వేడుకకు విచ్చేసిన సుకుమార్‌కు ధన్యవాదాలు. ఈ సినిమాకు ఆయన కూడా నాకు పార్ట్‌నర్ ఉండడం చాలా సంతోషంగా ఉంది. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులందరినీ మెప్పించి, ఘన విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాం’’ అని నిర్మాత వెంకట సతీష్ కిలారు ఈ కార్యక్రమంలో చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

తొక్కలో ఇంటర్వ్యూ.. అంటూ కుర్చీ విసిరేసి వెళ్లిపోయిన గెటప్ శ్రీను!

‘ఇద్దరి నుంచి ముగ్గురుగా’.. తల్లికాబోతోన్న శ్రీ విష్ణు హీరోయిన్!

‘భోగి’లో అనుపమ పరమేశ్వరన్.. ఫస్ట్ లుక్ మాములుగా లేదుగా!

కయాదు లోహర్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

Updated Date - May 01 , 2026 | 10:52 PM

Peddi - Ram Charan:  పెద్ది కోసం రామ్ చరణ్ ఫిట్‌నెస్‌ మిషన్‌

Peddi First Shot: రామ్ చరణ్ చెప్పినట్టే ఫస్ట్ షాట్ అదిరింది

Peddi Song: ‘చికిరి’ పాట కోసం రెహమాన్‌ ఎవర్ని దింపారంటే..

Peddi : రెహమాన్ డప్పు.. రామ్ చరణ్ స్టెప్పు.. మోత మోగడమే

Peddi Song: ‘పెద్ది సాంగ్‌.. బుచ్చి భలే ప్లాన్‌ చేశాడు..