అందుకు క్షమించి.. ఇందుకు ఆశీర్వదించండి - ‘పెద్ది’ దర్శకుడు
ABN, Publish Date - May 01 , 2026 | 09:43 PM
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న ‘పెద్ది’ సినిమా విడుదలపై క్లారిటీ వచ్చేసింది. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో రిలీజ్ డేట్‌ను అధికారికంగా టీమ్ ప్రకటించింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న ‘పెద్ది’ (Peddi) సినిమా విడుదలపై క్లారిటీ వచ్చేసింది. ఇప్పటి వరకు ఈ సినిమా పలు మార్లు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నప్పటికీ, వాయిదా పడుతూనే వచ్చింది. దీంతో ప్రేక్షకులు కూడా కన్ఫ్యూజన్‌లో ఉన్నారు. ఆ కన్ఫ్యూజన్‌కు తెరదించుతూ.. జూన్ 4న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ రిలీజ్ విషయంలో ఏర్పడిన గందరగోళానికి దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పారు. శుక్రవారం, హైదరాబాద్‌లో జరిగిన ‘పెద్ది’ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ కార్యక్రమంలో.. ఏప్రిల్ 30న రానందుకు క్షమించి.. జూన్ 4న వస్తున్నందుకు ఆశీర్వదించాలని ఆయన కోరారు.
‘‘ఈ కార్యక్రమానికి వచ్చిన సుకుమార్ సార్‌కి థాంక్యూ. ‘పెద్ది’ ఏప్రిల్ 30న రానందుకు క్షమించండి. జూన్ 4న ఈ సినిమా వస్తున్నందుకు ఆశీర్వదించండి. ఇది ఒక కమర్షియల్ ఎమోషనల్ రైడ్. ఫ్యాన్స్, ప్రేక్షకుల హృదయాలకు దగ్గరగా ఉంటుంది. ‘పెద్ది’ని మీ హృదయం నుంచి తీసేయడం అంత ఈజీ కాదు. చరణ్ సార్‌పై నా ప్రేమ జూన్ 4న మీరు చూస్తారు. ఈ అవకాశం ఇచ్చిన రామ్ చరణ్ సార్‌కు థాంక్యూ సో మచ్’’ అని బుచ్చిబాబు చెప్పుకొచ్చారు.
ఇదే వేడుకలో డీవోపీ రత్నవేలు మాట్లాడుతూ.. ‘పెద్ది’ కోసం ప్రాణం పెట్టి పని చేశాను. బుచ్చిబాబు అద్భుతమైన కథ రాశారు. ఆ కథకు నేను విజువల్ ఇచ్చాను. సుకుమార్, బుచ్చిబాబు ఇలా గొప్ప టీమ్‌తో పని చేయడం ఆనందంగా ఉంది. ఈ టీమ్‌ను చూస్తే ‘రంగస్థలం’ వైబ్ గుర్తుకు వస్తుంది. రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్, బుచ్చిబాబు స్క్రిప్ట్, స్క్రీన్‌ప్లే, మ్యూజిక్ అన్నీ అద్భుతంగా వచ్చాయి. కమర్షియల్‌గా డిఫరెంట్‌గా ట్రై చేశాం. తప్పకుండా ఈ సినిమా గొప్ప విజయాన్ని అందుకుంటుందని నమ్ముతున్నానని అన్నారు. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది.
ఇవి కూడా చదవండి:
తొక్కలో ఇంటర్వ్యూ.. అంటూ కుర్చీ విసిరేసి వెళ్లిపోయిన గెటప్ శ్రీను!
‘ఇద్దరి నుంచి ముగ్గురుగా’.. తల్లికాబోతోన్న శ్రీ విష్ణు హీరోయిన్!
‘భోగి’లో అనుపమ పరమేశ్వరన్.. ఫస్ట్ లుక్ మాములుగా లేదుగా!
కయాదు లోహర్ గురించి ఈ విషయాలు తెలుసా?