Buchi Babu Sana: ఇదే అభిమానం స్వామి.. బుచ్చి ఫిదా చేసేసాడు..
ABN, Publish Date - Apr 27 , 2026 | 10:18 AM
ధనుష్ అంటే నాకెంతో ఇష్టం. ఆయనకు పెద్ద అభిమానిని. ప్రస్తుతం ‘పెద్ది’ ఐటెమ్స్ సాంగ్ షూటింగ్‌తో బిజీగా ఉన్నా.
‘ధనుష్ (Dhanush) అంటే నాకెంతో ఇష్టం. ఆయనకు పెద్ద అభిమానిని. ప్రస్తుతం ‘పెద్ది’ ఐటెమ్స్ సాంగ్ షూటింగ్‌తో బిజీగా ఉన్నాను. కేవలం ధనుష్‌ని చూడాలనే సెట్ నుంచి త్వరగా వచ్చేశాను’ అని బుచ్చిబాబు సానా అన్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ‘కర’ (Kara) ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆయన అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్ది సినిమా విడుదలపై ఉన్న గందరగోళానికి ఫుల్‌స్టాఫ్ పెట్టారు. జూన్ 25వ తేదీని ఎట్టి పరిస్థితుల్లో సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుందని చెప్పారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఉప్పెన’ సినిమా సమయంలో నేనూ, వైష్ణవ్ తేజ్... ధనుష్ చిత్రాల గురించి మాట్లాడుకునేవాళ్లం. ‘రాంఝానా’, ‘ఆడుకాలమ్’ సినిమాలంటే ఎంతో ఇష్టం. చెన్నై వెళ్ళినప్పుడు రెహమాన్ గారు ధనుష్ డెడికేషన్ గురించి చెబుతుంటారు. మిస్ అవుతానని కంగారుతో ఆయన్ని చూడటానికి షూటింగ్ నుంచి వచ్చేశాను. ‘కర’ గొప్ప టైటిల్. వైజాగ్‌లో కాళీపట్నం రామారావు అని గొప్ప రచయిత ఉండేవారు. ఆయన్ను కారా మాస్టర్ అని పిలిచేవారు. ఆయన ఆస్తి అంతా రైటర్స్‌కి ఇచ్చేశాడు. ఇంటిని లైబ్రరీ చేసేశారు. తెలుగులో పుట్టిన ప్రతి కథ ఆయన 'కథానిలయం'లో ఉంటుంది. ‘కర’ టైటిల్ వినగానే నాకు ఆయనే గుర్తొచ్చారు. ఈ సినిమా ట్రైలర్ ప్రామిసింగ్‌గా ఉంది. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
Updated at - Apr 27 , 2026 | 02:24 PM