సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

పవర్ స్టార్ బర్త్‌డేకి ‘ఓజీ-2’ అప్డేట్ ఉంటుందా..

ABN, Publish Date - Aug 29 , 2026 | 05:42 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఓజీ-2’. రాబోయే పవర్ స్టార్ బర్త్‌డే‌కు ఈ మూవీ నుంచి ఏమైనా సర్‌ప్రైజ్ ఉంటుందా? అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

OG2 Update

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan), యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ సుజీత్ (Director Sujeeth) కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఓజీ-2’ (OG 2). ‘ఓజీ’ తర్వాత వస్తున్న ఈ సీక్వెల్ పై అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావడంతో అందరి చూపు ఇప్పుడు సెప్టెంబర్ 2న రాబోయే పవర్ స్టార్ బర్త్ డే (Pawan Kalyan Birthday) అప్‌డేట్‌పైనే పడింది. ఫ్యాన్స్ పవన్ పుట్టినరోజును పండగలా జరుపుకోవడానికి రెడీ అవుతున్న వేళ.. ‘ఓజీ-2’ నుంచి ఎలాంటి సర్‌ప్రైజ్ రాబోతోందా? అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.


మొదటి భాగం ‘ఓజీ’లో పవర్ స్టార్‌ను సుజీత్ ప్రెజంట్ చేసిన విధానం, ఆ మాఫియా బ్యాక్‌డ్రాప్, స్టైలిష్ విజువల్స్, ఎమోషన్స్ థియేటర్లను షేక్ చేశాయి. దానికి తోడు ఎస్.ఎస్. థమన్ అందించిన విజిల్ వర్తీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. అందుకే ‘ఓజీ-2’ పై అభిమానులు కొండంత ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల ఒక ఈవెంట్‌లో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మాట్లాడుతూ.. పవన్ పుట్టినరోజు సందర్భంగా ‘ఓజీ-2’ అప్‌డేట్ ఖచ్చితంగా ఉంటుందని చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పారు. అయితే ఇన్‌సైడ్ టాక్ ప్రకారం చూస్తే.. బర్త్‌డే రోజు ఒక పోస్టర్ లేదా చిన్న యానిమేషన్ గ్లింప్స్ రిలీజ్ చేయడం మినహా, అంతకన్నా పెద్ద కంటెంట్ ఏదీ వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్ కొంత నిరాశకు గురవుతున్నారు. ఈ సీక్వెల్ చేయడం పట్ల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా ఆసక్తిగా ఉన్నప్పటికీ, ఆయన ప్రెజెంట్ హెల్త్ కండీషన్, పొలిటికల్ షెడ్యూల్స్ దృష్ట్యా షూటింగ్ ఎప్పటి నుంచి మొదలుపెట్టాలనే దానిపై స్పష్టత లేదు.


మరోవైపు దర్శకుడు సుజీత్, నేచురల్ స్టార్ నానితో అనుకున్న ‘బ్లడీ రోమియో’ ప్రాజెక్ట్ పూర్తి చేసిన తర్వాతే పూర్తిగా ‘ఓజీ-2’ని ప్లాన్ చేయనున్నారట. ఎలా చూసుకున్నా దీనికి ఇంకా చాలా టైమ్ పడుతుంది. పవన్ కూడా ఇప్పుడప్పుడే వరుస సినిమాలు చేయాలనే హడావుడిలో లేరు. అందుకే దర్శకుడు సురేందర్ రెడ్డితో అనుకున్న ప్రాజెక్ట్‌ను కూడా హోల్డ్‌లో పెట్టేశారు. ప్రస్తుతం ‘ఓజీ-2’ మాత్రమే సాలిడ్‌గా ముందుకు వెళ్తోంది. ఒకవేళ బర్త్‌డేకి ఫస్ట్ లుక్ వచ్చినా, అది సెట్స్ పైకి వెళ్లేసరికి చాలా సమయం పడుతుంది. షూట్ జరుపుకుని థియేటర్లలోకి వచ్చేసరికి 2027 అయిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక సుజీత్ ఆల్రెడీ ‘ఓజీ-2’ స్క్రిప్ట్‌ను పర్ఫెక్ట్‌గా సిద్ధం చేసి పెట్టారట. పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం ఆలస్యం వెంటనే సెట్స్ పైకి తీసుకెళ్తారు. ఏదేమైనా, ‘ఓజీ-2’ విషయంలో కాస్త లేట్ అయినా సరే.. థియేటర్లలో సునామీ గ్యారంటీ అంటున్నారు అభిమానులు.

ఇవి కూడా చదవండి:

‘దాయ్రా’లో డీసీపీ అజూనీ కోహ్లీగా కరీనా.. పవర్‌ఫుల్ పోస్టర్ వైరల్

శంకర్-మురుగదాస్ కాంబోలో మూవీ.. బాక్సాఫీస్ షేకే!

‘ది ప్యారడైజ్’ నుంచి ‘ఏషనాగుల’ మాస్ ఫోక్ ఆంథమ్ వచ్చేసిందోచ్

Updated Date - Aug 29 , 2026 | 05:42 PM