సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

NTR: ‘డ్రాగన్’లో తారక్‌పై స్పెషల్ సాంగ్.. ఫ్లాష్‌బ్యాక్‌లో ఊహించని ట్విస్ట్

ABN, Publish Date - Oct 19 , 2026 | 08:46 AM

భుజం గాయానికి శస్త్రచికిత్స చేయించుకుని కొంతకాలం విశ్రాంతి తీసుకున్న మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) మళ్లీ సినిమా షూటింగ్‌లో బిజీ అయ్యారు.

భుజం గాయానికి శస్త్రచికిత్స చేయించుకుని కొంతకాలం విశ్రాంతి తీసుకున్న మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) మళ్లీ సినిమా షూటింగ్‌లో బిజీ అయ్యారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ కోసం ఆయన తిరిగి కెమెరా ముందుకు రావడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. తాజాగా షూటింగ్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  అక్టోబర్ 15 నుంచి తారక్ ‘డ్రాగన్’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా నిర్మిస్తున్న భారీ సెట్‌లో ఓ పాటను చిత్రీకరించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ పాటను పూర్తిగా ఎన్టీఆర్ పై షూట్ చేస్తారట సాంగ్ షూట్ తర్వాత జరిగే  షెడ్యూల్ లో ఎన్టీఆర్‌తో పాటు ఇతర కీలక నటీనటులు కూడా షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. దీంతో రాబోయే షెడ్యూల్స్‌లో చిత్రీకరణ మరింత వేగం పుంజుకునే అవకాశముంది. ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్‌డేట్ కోసం తారక్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

‘డ్రాగన్’ ఫ్లాష్‌బ్యాక్‌లో కలర్‌ఫుల్ ట్రీట్?

ప్రశాంత్ నీల్ సినిమాలంటే భారీ యాక్షన్ సన్నివేశాలు, డార్క్ విజువల్స్, గ్రే షేడ్స్ గుర్తుకొస్తాయి. అయితే ‘డ్రాగన్’ విషయంలో ఆయన భిన్నమైన విజువల్ ట్రీట్ ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఈ సినిమాలోని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ను కలర్ ఫుల్ గా  తెరకెక్కిస్తున్నట్లు చిత్ర బృందం నుంచి టాక్. నీల్ సినిమాల్లో కనిపించే డార్క్ టోన్‌కు భిన్నంగా ఈ భాగం ఉండనుందనే వార్తలు అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచుతున్నాయి. అయితే ఫ్లాష్ బ్యాక్ మాత్రం ఊహలు అందకుండా ఉంటుందట. దీనితో ఎన్టీఆర్‌ను ప్రశాంత్ నీల్ ఏ తరహా పాత్రలో చూపించబోతున్నారు? యాక్షన్‌తో పాటు కథలో ఎలాంటి కొత్తదనం ఉండబోతోంది? అన్న ఆసక్తి అభిమానుల్లో పెరిగింది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి:

యంగ్ హీరోతో ‘ఓ పిట్టకథ’ దర్శకుడి చిత్రం ప్రారంభం

ముంబైలో సంచలనం.. హీరో టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. ఆ గ్యాంగ్ పనేనా?

‘కల్ట్’ ట్రైలర్ రివ్యూ: నెత్తురోడే యాక్షన్.. ఒళ్లు గగుర్పొడిచే వయొలెన్స్

Updated Date - Oct 19 , 2026 | 09:23 AM