NTRNEEL: డ్రాగన్.. ముంబైకి ఎన్టీఆర్!
ABN, Publish Date - May 15 , 2026 | 05:32 PM
యంగ్ టైగర్ ఎన్టీఆర్, క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ గ్లింప్స్‌ని ఎన్టీఆర్ బర్త్‌డే స్పెషల్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR), క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘దేవర’ (Devara) తర్వాత తారక్, ‘సలార్’ (Salaar) వంటి భారీ హిట్ తర్వాత ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ కావడంతో దీనిపై పాన్ ఇండియా రేంజ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘డ్రాగన్’ (Dragon) అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ తన కెరీర్‌లోనే ఒక మాస్టర్ పీస్‌గా మలచాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. దీంతో ఈ సినిమా అప్‌డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని సినీ అభిమానులతో పాటు తారక్ ఫ్యాన్స్ కూడా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా.. మే 19వ తేదీ అర్ధరాత్రి ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేసి సోషల్ మీడియాను షేక్ చేసేందుకు చిత్ర బృందం సిద్ధమైంది. ఈ ఫస్ట్ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌ను కేవలం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకే పరిమితం చేయకుండా, నేషనల్ లెవల్లో భారీగా నిర్వహించాలని మేకర్స్ నిర్ణయించారు. దీనికోసం ఎన్టీఆర్ స్వయంగా ముంబై వెళ్లనున్నారట. అక్కడ జాతీయ మీడియా సమక్షంలో ఈ ఫస్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్‌ను ప్రెజెంట్ చేయబోతున్నారని తెలుస్తోంది.
ప్రశాంత్ నీల్ గత చిత్రం ‘సలార్’ సాధించిన విజయం దృష్ట్యా, బాలీవుడ్ వర్గాల్లో సైతం ఈ ప్రాజెక్టుపై విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే ప్రమోషన్లను ముంబై నుంచే ఘనంగా ప్రారంభించాలని నిర్మాతలు భావిస్తున్నారు. సుమారు మూడు నిమిషాల పాటు ఉండే ఈ గ్లింప్స్‌తో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద తారక్ మరోసారి తన సత్తా చాటడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక ప్రశాంత్ నీల్ సినిమాల సక్సెస్‌లో సంగీత దర్శకుడు రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సినిమాకు కూడా ఆయనే సంగీతం అందిస్తుండటంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. సుమారు 180 సెకన్ల పాటు సాగే ఈ గ్లింప్స్‌లో రవి బస్రూర్ ఇచ్చే మ్యూజిక్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించేలా ఉంటుందని సమాచారం. ప్రతి ఫ్రేమ్‌ను ఎలివేట్ చేసేలా ఆ సౌండ్ ట్రాక్ ఉంటుందని, ముఖ్యంగా ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ వద్ద వచ్చే మ్యూజిక్ నెక్స్ట్ లెవల్‌లో ఉండబోతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ భారీ యాక్షన్ డ్రామాలో ఎన్టీఆర్ సరసన కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమె నటన, ఎన్టీఆర్‌తో ఆమె కెమిస్ట్రీ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి. బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ ఒక కీలక పాత్రలో మెరవబోతున్నారట. అనిల్ కపూర్ పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని సమాచారం. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా రానుండటంతో పాటు ఎన్టీఆర్ రెండు విభిన్నమైన గెటప్పుల్లో కనిపిస్తారని టాక్. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది జూన్ 11వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ చిత్రం ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో తెలియాలంటే ఈ నెల 19న రాబోయే గ్లింప్స్ వరకు ఆగాల్సిందే!.
ఇవి కూడా చదవండి:
Varanasi: ‘వారణాసి’ కోసం మైత్రీ వేట.. టెంప్టింగ్ ఆఫర్!
Tom Cruise: తెలుగు యువ దర్శకుడితో టామ్ క్రూజ్ భారీ చిత్రం!
Tollywood: డూప్లికేట్ జుత్తు, పాము.. సునీల్ నారంగ్ వర్సెస్ నాగవంశీ!
నిన్న ఆలీ.. నేడు రాజీవ్ కనకాల.. ఇలాంటి ఇబ్బందులు తప్పవు మరి!