ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుంచి అదిరిపోయే అప్‌డేట్!
ABN, Publish Date - Oct 11 , 2026 | 06:40 PM
ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘డ్రాగన్’. తాజాగా ఈ సినిమాకు సంబంధించి వచ్చిన అప్డేట్‌తో.. మరోసారి ఈ సినిమా వార్తలలో హైలెట్ అవుతోంది.
ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Man Of Masses Jr NTR), బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘డ్రాగన్’ (Dragon). ‘కేజీయఫ్’, ‘సలార్’ లాంటి చిత్రాల తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లోనూ అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ షూటింగ్ అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.
ఇటీవల చేతి గాయం కారణంగా కొద్దిరోజులు విశ్రాంతి తీసుకున్న ఎన్టీఆర్, ఇప్పుడు పూర్తిగా కోలుకుని మళ్లీ సెట్స్‌పైకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ చిన్న విరామంతో కొంత డీలా పడిన అభిమానులు సోషల్ మీడియాలో వచ్చిన తాజా అప్‌డేట్‌తో ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను మేకర్స్ నవంబర్ మొదటి వారం నుంచి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా భారీ సెట్‌ను కూడా వేశారట. ఈ సెట్‌లో హీరోపై కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. అంతేకాకుండా, ఎన్టీఆర్‌తో పాటు మిగిలిన ప్రధాన తారాగణంపై కూడా ఈ షెడ్యూల్‌లో ముఖ్యమైన సన్నివేశాలను షూట్ చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. అంతేకాదు, అనిల్ కపూర్, బిజూ మీనన్ లాంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బాలీవుడ్ స్టార్స్ షాహిద్ కపూర్, ఆలియా భట్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నారనే టాక్ ఫిలింనగర్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ప్రశాంత్ నీల్ గత సినిమాల వలే ఈ చిత్రం కేవలం డార్క్ షేడ్స్‌కే పరిమితం కాదట. ‘డ్రాగన్’లో కలర్‌ఫుల్ రంగులు, విభిన్నమైన లైటింగ్, సరికొత్త ఫ్రేమింగ్‌ను వాడుతున్నారని తెలుస్తోంది. కథలోని ఎన్టీఆర్ పాత్ర ఎమోషనల్ వేరియేషన్స్ ప్రేక్షకులకు బలంగా కనెక్ట్ కావడమే దీని ప్రధాన ఉద్దేశం. అంతేకాకుండా, ఈ చిత్రంలోని యాక్షన్ సీక్వెన్స్‌లను ఏకంగా హాలీవుడ్ రేంజ్‌లో ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. ఈ ఫైట్స్ కోసం లేటెస్ట్ హాలీవుడ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారని, థియేటర్లలో ఈ సీన్స్ చూస్తున్నప్పుడు ప్రేక్షకులు మైమరచిపోవడం ఖాయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ముందుగా ప్రకటించిన ప్రణాళిక ప్రకారమే ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ వచ్చే ఏడాది జూన్ 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. హాలీవుడ్ రేంజ్ ఫైట్స్, కొత్త తరహా విజువల్స్‌తో వస్తున్న ‘డ్రాగన్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి:
గతంతో పోలిస్తే అన్ని రంగాల్లో పురోగతి.. ఏపీ అభివృద్ధిపై చిరు కీలక వ్యాఖ్యలు
ఏపీ ఫిలిం ఛాంబర్‌లో M4M హవా.. జో శర్మ, మోహన్ వడ్లపట్లకు అవార్డులు
ప్రసవం తర్వాత లుక్స్‌పై కామెంట్స్.. కత్రినా ఇచ్చిపడేసింది