విడుదలకు ఒక్కరోజు ముందు ‘అ’ వాయిదా!
ABN , Publish Date - Nov 11 , 2026 | 01:52 PM
నవంబర్ రెండో వీకెండ్లో తొమ్మిది సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. అయితే విడుదలకు ఒక్కరోజు ముందు రాహుల్ విజయ్, అర్చనా అయ్యర్ నటించిన ‘అ’ సినిమాను వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ‘భోగి’, ‘రోమియో జూలియట్’ సహా పలు చిత్రాలు కూడా వాయిదా పడ్డాయి.
నవంబర్ సెకండ్ వీకెండ్లో విడుదల కావాల్సిన సినిమాల జాబితా పెద్దగానే ఉంది. దీపావళి కానుకగా గత గురు, శుక్రవారాల్లో కేవలం నాలుగు సినిమాలు విడుదలైతే అందులో మూడు డబ్బింగ్ కాగా, ఒక్కటే స్ట్రయిట్ తెలుగు సినిమా. కానీ ఈ వీకెండ్లో ఒక్కటి తప్ప అన్నీ స్ట్రయిట్ తెలుగు సినిమాలే. ఇందులో చెప్పుకోదగ్గ సినిమాలు పెద్దగా లేకపోయినా... విడుదల అవుతున్న సినిమాలు ఎక్కువ ఉండటం విశేషం. ఇప్పటికే శర్వానంద్ హీరోగా సంపత్ నంది తెరకెక్కించిన 'భోగి' సినిమా వాయిదా పడింది. అనుకున్న సమయంలో ఈ సినిమా సెన్సార్ కాకపోవడం, రివైజింగ్ కమిటీ సర్టిఫికెట్ ఇచ్చే సరికీ పుణ్యకాలం కాస్త గడిచిపోవడంతో ఈ సినిమాను మేకర్స్ వాయిదా వేసుకున్నారు. అలానే 'రోమియో జూలియట్' మూవీ మరోసారి వాయిదా పడిన విషయాన్ని చిత్రంగా 'డార్క్ చాక్లెట్' మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో బిందు మాధవి చెప్పారు. అలానే ఈ నెల 13న రావాల్సిన శివ కందుకూరి 'టాల్కమ్ పౌడర్' గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. ఆ సినిమా కూడా వాయిదా పడిందనే అనుకోవాలి. తాజాగా తమ 'అ' సినిమాను కూడా వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ తెలిపారు.
రాహుల్ విజయ్, అర్చనా అయ్యర్ ప్రధాన పాత్రల్లో కనకరావు తొనంగి, అభిషేక్ కె, ప్రముఖ ఎడిటర్ గ్యారీ బి.హెచ్ నిర్మించిన చిత్రం ‘అ'. ఈ సినిమాకి సాయి బాలి దర్శకత్వం వహించారు. కొద్దిరోజుల క్రితం ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ సైతం జరిగింది. నందినీరెడ్డి, వంశీ నందిపాటి, ఆకాశ్ పూరి, శివానీ, శివాత్మిక రాజశేఖర్ తదితరులంతా ఈ కార్యక్రమానికి హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. కానీ విడుదలకు ఒక్క రోజు ముందు ఈ వాయిదా విషయాన్ని మేకర్స్ ప్రకటించడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే కూడా గురు, శుక్ర, శనివారాల్లో తొమ్మిది సినిమాలు విడుదల కాబోతున్నాయి.
ఇవి కూడా చదవండి:
పెళ్లిపీటలెక్కనున్న ఇరుముడి భామ.. వరుడు ఎవరంటే
రామాయణం ప్రభంజనం.. రికార్డులన్నీ బద్దలు
పవన్ కళ్యాణ్ విడాకులు.. రేణు దేశాయ్ సంచలన పోస్ట్