సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tollywood: గేరు మార్చి... జోరు పెంచిన నివేదా పేతురాజ్‌!

ABN, Publish Date - Jun 15 , 2026 | 03:43 PM

నటిగా వైవిధ్యమైన పాత్రలు చేసిన నివేదా పేతురాజ్ స్ట్రాంగ్‌ కమ్ బ్యాక్‌ ఇచ్చింది. 'సింగ్ గీతం'లో కీలక పాత్ర పోషించిన నివేదా ఇప్పుడు ఇటు చిరంజీవి, అటు వెంకటేశ్‌ సినిమాల్లోనూ నటిస్తోంది.

Nivetha Pethuraj

నటి నివేదా పేతురాజ్‌ (Nivetha Pethuraj) కు అవకాశాలు తగ్గిపోవడంతో... సినిమాలకు గుడ్ బై చెప్పేసి... హాయిగా పెళ్ళి చేసుకుని జీవితంతో స్థిరపడిపోతుందని అంతా అనుకున్నారు. అలానే ఆమె కూడా గత యేడాది ఆగస్టులో దుబాయ్‌ స్థిరపడిన మలయాళీ బిజినెస్ మ్యాన్‌ రాజ్ హిత్ ఇబ్రాన్ తో నిశ్చితార్థం జరిగినట్టుగా ఇన్ డైరెక్ట్ గా అభిమానులకు తెలియచేసింది. అంతా అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఎందుకవుతుంది!? ఆ తర్వాత నాలుగు నెలలకే నివేదా ఎంగేజ్‌మెంట్‌ను రద్దు చేసుకుంది. ఆ విషయం కూడా ఫ్యాన్స్ కు ఇన్ డైరెక్ట్ గానే ఆమె తెలిపింది. ఇటు సినిమాలకు దూరమై... అటు వ్యక్తిగత జీవితంలో ఎదురుదెబ్బ తిన్న నివేదా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో కదా! అని అందరూ అనుకున్నారు. ఆ సమయంలో తన ఆలోచనలు ఎలా ఉన్నాయో స్వయంగా నివేదా పేతురాజ్ ఆదివారం తెలిపింది.


జూన్‌ 12న విడుదలైన 'సింగ్ గీతం' (Sing Geetham) మూవీలో నివేదా పేతురాజ్ ఓ కీలక పాత్రను పోషించింది. అందులో ఆమె నటించిన విషయాన్ని మేకర్స్ గోప్యంగా ఉంచారు. నివేదా పేతురాజ్, రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాలో హీరో తల్లిదండ్రులుగా యాక్ట్ చేశారు. మరీ ముఖ్యంగా ఈ సినిమాకు ఆయువుపట్టు లాంటి పాత్ర ఆమెది. మూడేళ్ళ క్రితం 'దాస్ కా ధమ్కీ' చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత హారర్ మూవీ 'బూ'లో చేసింది. అది ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యింది. అలానే అప్పుడే 'పరువు' అనే వెబ్ సీరిస్ లో నటించింది. ఆ తర్వాత ఆమె తెరపై కనిపించిన సినిమా ఇదే! ఓ రకంగా 'సింగ్‌ గీతం' నివేదా పేతురాజ్ కు కమ్ బ్యాక్‌ మూవీ అనుకోవచ్చు.

ఆదివారం జరిగిన ఈ సినిమా ప్రెస్ మీట్‌లో నివేదా పేతురాజ్ ఆసక్తికరమైన అంశాన్ని వెల్లడించింది. జీవితంలో తాను తీసుకున్న కొన్ని పొరపాటు నిర్ణయాల వల్ల సినిమా రంగాన్ని వదిలి ఒంటరిగా హిమాలయాలకు వెళ్ళిపోవాలనుకున్నానని, అక్కడే ధ్యానం చేస్తూ గడపాలని ఆశించానని తెలిపింది. అయితే నాగ్ అశ్విన్ రూపంలో తన జీవితం మరో మలుపు తిరిగిందని ఆమె చెప్పింది. నాగ్‌ కోరికపై తాను 'సింగ్‌ గీతం'లో నటించానని, ఈ సినిమా విజయం తనకు కొత్త ఊపిరి పోసిందని తెలిపింది.


ఇదంతా బాగానే ఉంది. అయితే నివేదా తీసుకున్న 'రీఎంట్రీ' నిర్ణయంతో ఆమె నక్కతోక తొక్కినట్టు అయ్యింది. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఇద్దరు సీనియర్ స్టార్ హీరోల సినిమాల్లో ఇప్పుడు నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తోంది. అందులో ఒకటి మెగాస్టార్ చిరంజీవితో బాబీ తెరకెక్కిస్తున్న సినిమా కాగా మరొకటి వెంకటేశ్‌ మూవీ. చిరంజీవి సినిమా పొల్లాచ్చి షెడ్యూల్‌ ఇటీవలే పూర్తయ్యింది. ఈ షెడ్యూల్‌ చివరి రోజున నివేదా పేతురాజ్ కెరీర్ పదేళ్ళు పూర్తయిన సందర్భంగా చిత్ర బృందం కేక్ కట్ చేయించి ఆమెకు శుభాకాంక్షలు తెలిపింది. అలానే విక్టరీ వెంకటేశ్‌తో త్రివిక్రమ్ తెరెక్కిస్తున్న 'ఆదర్శ కుటుంబం'లోనూ నివేదా పేతురాజ్ నటిస్తోంది. గతంలో త్రివిక్రమ్ రూపొందించిన 'అల వైకుంఠపురములో' సినిమాలో నివేదా పేతురాజ్... సుశాంత్‌ కు జోడీగా నటించింది. ఆ సినిమాలో పెద్దంత ప్రాధాన్యం లేని పాత్రను ఇచ్చినా... త్రివిక్రమ్ మీద అభిమానంతో నివేదా ఆ పాత్ర చేసింది. అందుకే ఇప్పుడు త్రివిక్రమ్.. వెంకటేశ్‌ మూవీలో ఆమెకు ఛాన్స్ ఇచ్చాడని అనుకుంటున్నారు. మొత్తం మీద ఇలా బ్యాక్ టు బ్యాక్ సీనియర్ స్టార్ హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్ ను నివేద దక్కించుకోవడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

బాలీవుడ్‌లో కనిపించని నవతరం స్టార్స్.. హిందీ సినిమా ఫ్యూచర్ ఏంటి?

ఎయిర్ పోర్ట్‌లో వడ్డే నవీన్ పరపతి చూసి షాకయ్యా: వివి వినాయక్

రామ్ చరణ్, ఉపాసనల పెళ్లి రోజు.. ట్విన్స్ గ్లింప్స్ పిక్ వైరల్!

బుచ్చిబాబు సారీ చెప్పడం నాకు నచ్చలేదు: అనంత శ్రీరామ్

Updated Date - Jun 15 , 2026 | 03:45 PM