నితిన్ ‘అలియాస్ రుక్మిణీ’ షూటింగ్ పూర్తి.. డిసెంబర్ 4న థియేటర్లలోకి!
ABN , Publish Date - Nov 09 , 2026 | 04:45 PM
నితిన్ హీరోగా మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అలియాస్ రుక్మిణీ’ సినిమా షూటింగ్ పూర్తయింది. నాని సమర్పణలో యూనానిమస్ ప్రొడక్షన్స్‌పై దీప్తి గంటా నిర్మిస్తున్న ఈ ప్రేమకథ డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. నితిన్‌తో సినిమా చేయడం తన కల నెరవేరినట్టుందని దర్శకుడు మురళీకాంత్ తెలిపారు.
నేచురల్ స్టార్ నాని సమర్పణలో తెరకెక్కిన 'కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ' ఘన విజయానంతరం ఆయన యూనానిమస్ ప్రొడక్షన్స్ రెండో చిత్రంగా 'అలియాస్ రుక్మణీ' చిత్రం నిర్మించారు. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి 'దండోరా' ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్నారు. దీప్తి గంటా నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 4న విడుదల కాబోతోంది.
ఈ సినిమా గురించి, నితిన్ గురించి నాని మాట్లాడుతూ, 'నా కెరీర్ ప్రారంభం నుంచే, నేను సక్సెస్ కాకముందే నితిన్ నాకు ఎంతో సపోర్ట్ చేశారు. 'జయం', 'ఇష్క్', 'గుండెజారి గల్లంతయ్యిందే' వంటి సినిమాల్లో నితిన్‌ను ప్రేక్షకులు ఎంతగా ప్రేమించారో మనందరికీ తెలుసు. ఇప్పుడు 'అలియాస్ రుక్మిణి'తో మరోసారి ఆయనను ప్రేమించేలా చేసే సినిమా చేస్తున్నామనే నమ్మకం ఉంది. ఇది చాలా అందమైన ప్రేమకథ. మంచి కథ, అద్భుతమైన టెక్నీషియన్స్‌తో కలిసొస్తే అలాంటి ప్రేమకథలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. ప్రేక్షకులు చాలా కాలం గుర్తుంచుకునే సినిమా చేయబోతున్నాం. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తాం. ఈ సినిమా చాలా ప్రత్యేకంగా నిలుస్తుందనే నమ్మకం ఉంది' అని అన్నారు. ఇదిలా ఉంటే... 'అలియాస్ రుక్మిణీ' మూవీ షూటింగ్ పూర్తయ్యింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా మేకర్స్ తెలిపారు. షూటింగ్ పూర్తయిన శుభసందర్భంలో హీరో నితిన్, దర్శకుడు మురళీకాంత్, ప్రొడ్యూసర్ గంటా దీప్తి ఛీర్స్ చెప్పుకున్నారు.
దర్శకుడు మురళీకాంత్ దేవసోత్ మాట్లాడుతూ, 'ఈ కథను నాని అన్నకు చెప్పిన వెంటనే 'చేద్దాం' అనడంతో ఈ ప్రయాణం మొదలైంది. అప్పటి నుంచి అన్నీ చాలా అందంగా జరుగుతున్నాయి. నితిన్ అన్న ఈ సినిమాలో భాగం కావడం నా కల నిజమైనట్టే. అదే సమయంలో బాధ్యత కూడా మరింత పెరిగింది. మా బెస్ట్ ఇవ్వడానికి మేమంతా ఎంతో కష్టపడ్డాం' అని అన్నారు.

నిర్మాత దీప్తి గంటా మాట్లాడుతూ, 'కొన్ని కథలు విన్న వెంటనే 'ఇది ప్రత్యేకమైన సినిమా అవుతుంది' అనే ఫీలింగ్ వస్తుంది. మురళీ ఈ కథ చెప్పినప్పుడు నాకు అదే అనిపించింది. నాని కూడా ఖచ్చితంగా ఒప్పుకుంటారని నమ్మాను. 'కోర్ట్' తర్వాత ఎన్నో కథలు విన్నాం. కానీ మొదటిసారి ఈ కథ విన్నప్పుడు మాత్రమే ఆ బలమైన నమ్మకం కలిగింది. ఇది అద్భుతమైన స్క్రిప్ట్. మా కృష్ణ పాత్ర కోసం సరైన హీరోని వెతుకుతున్న సమయంలో 'నితిన్ అన్నను అడుగుదామా' అని నాని సూచించారు. అనౌన్స్మెంట్ వీడియో షూట్ చేసిన తర్వాత ఆ లుక్‌లో నితిన్‌ను చూసిన క్షణమే ఆయనే మా కృష్ణ అని ఫిక్స్ అయిపోయాం. ఆ పాత్రకు ఆయన పర్ఫెక్ట్గా సరిపోయారు. ఈ ప్రయాణాన్ని మీరంతా ఆస్వాదించే డిసెంబర్ 4వ తేదీ కోసం ఎదురుచూస్తున్నాం' అని అన్నారు.