ఫ్యాంటసీ ప్రపంచంలోకి నందమూరి వారసుడు.. మోక్షజ్ఞ కోసం బాల‌య్య‌ భారీ ప్లాన్!

ABN , Publish Date - Nov 09 , 2026 | 03:07 PM

మోక్షజ్ఞ డెబ్యూ సినిమాపై ఆసక్తికరమైన వార్తలు టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

Mokshagna

నందమూరి అభిమానులు ఎన్నో ఏళ్లుగా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ఆ ఘడియ రానే వచ్చింది. నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తనయుడు మోక్షజ్ఞ (Mokshagna) సినీ ఎంట్రీపై రోజుకో సరికొత్త వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. గత కొన్నేళ్లుగా మోక్షజ్ఞ లాంచ్ ఎప్పుడు ఉంటుంది, ఎవరు డైరెక్ట్ చేస్తారు అనే చర్చలకు దాదాపు తెరపడినట్లే కనిపిస్తోంది. టాలీవుడ్ లేటెస్ట్ బజ్ ప్రకారం.. మోక్షజ్ఞ డెబ్యూ ప్రాజెక్ట్‌ను హ్యాండిల్ చేసే బాధ్యతను టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ఠ (Vassishta) భుజాన వేసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. అంతేకాదు, ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో బాలకృష్ణ ఒక పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనున్నారనే వార్త వినగానే నందమూరి అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

మొదటి సినిమా బింబిసార తోనే కంటెంట్‌ను విజువల్ వండర్‌గా తెరకెక్కించగల సత్తా చాటుకున్న దర్శకుడు వశిష్ఠ. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర వంటి పాన్-ఇండియా సోషియో ఫాంటసీ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా చెక్కుతున్నారు. ఈ క్రమంలోనే మోక్షజ్ఞ కోసం వశిష్ఠ సిద్ధం చేసిన కథ బాలకృష్ణతో పాటు మొత్తం నందమూరి కాంపౌండ్‌ను ఎంతగానో మెప్పించినట్లు టాక్. ప్రస్తుతం వశిష్ఠ ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫైనల్ డ్రాఫ్ట్‌ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. క్యారెక్టర్ డిజైన్స్, డైలాగ్స్, స్క్రీన్‌ప్లే పరంగా ఎక్కడా చిన్న లోపం కూడా లేకుండా పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. సాధారణంగా ఒక స్టార్ హీరో కొడుకు లాంచ్ అవుతున్నాడంటే.. ఫైట్లు, డ్యాన్సులు, రొటీన్ ఫ్యాక్షన్ లేదా రెగ్యులర్ కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన కథను ఎంచుకోవడం ఆనవాయితీ.

కానీ మోక్షజ్ఞ డెబ్యూ కోసం మాత్రం ఆ రొటీన్ ట్రాక్‌ను పూర్తిగా పక్కన పెట్టేశారట. అందుతున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రాన్ని భారీ విజువల్ వండర్‌గా, సోషియో-ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందించనున్నారు. మల్టిపుల్ టైమ్‌లైన్స్, పునర్జన్మల కాన్సెప్ట్, హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. కొత్తదనం కోరుకునే నేటి తరానికి మోక్షజ్ఞను సరికొత్తగా పరిచయం చేయాలనే ఆలోచనతోనే వశిష్ఠను ఎంపిక చేసినట్లు స్పష్టమవుతోంది. ఈ జోనర్‌లో వశిష్ఠకున్న పట్టును దృష్టిలో ఉంచుకుంటే.. మోక్షజ్ఞ లాంచ్‌కు ఇది సరైన ఎంపిక అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక ఈ సినిమా సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుందనే ప్రశ్నకు సమాధానం దొరికింది. వచ్చే ఏడాది జనవరి చివరి వారం నుంచే రెగ్యులర్ షూటింగ్‌ను గ్రాండ్‌గా మొదలుపెట్టేందుకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మొదటగా మోక్షజ్ఞ పై కొన్ని కీలక యాక్షన్ సీక్వెన్సెస్, ఇంట్రడక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారని టాక్. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అందరినీ అమితంగా ఆకట్టుకుంటున్న విషయం.. బాలకృష్ణ ఇందులో నటించబోతుండటమే. కేవలం ఏదో గెస్ట్ రోల్ కాకుండా, కథను మలుపు తిప్పే ఒక అత్యంత బలమైన పాత్రలో బాలకృష్ణ కనిపించనున్నారట.

తండ్రీకొడుకులు ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించే సన్నివేశాలు థియేటర్లలో ప్రేక్షకులకు అసలైన గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయం. ఏదేమైనా, టాలీవుడ్‌లో ఇప్పుడు అందరి కళ్లు మోక్షజ్ఞ డెబ్యూ ప్రాజెక్ట్‌పైనే ఉన్నాయి. అధికారిక ప్రకటనతో పాటు ఫస్ట్ లుక్ లేదా గ్లింప్స్ బయటకు వస్తే తప్ప ఈ సినిమా అసలు కథ, రేంజ్ ఏంటనేది పూర్తి క్లారిటీ రాదు. నందమూరి లెగసీని ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్న మోక్షజ్ఞ ఎంట్రీ సినీ పరిశ్రమలో ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి!

Updated Date - Nov 09 , 2026 | 03:07 PM