సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Swayambhu: 175 రోజుల షూటింగ్... 2, 500 వీఎఫ్‌ఎక్స్ షాట్స్!

ABN, Publish Date - Sep 12 , 2026 | 08:31 PM

నిఖిల్‌ తాజా చిత్రం 'స్వయంభు' షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా కోసం 175 రోజులు షూటింగ్‌ జరిపామని మేకర్స్ తెలిపారు.

Swayambhu Movie

నిఖిల్ సిద్ధార్థ్ ‘స్వయంభు’ సినిమాతో ప్రేక్షకులను చారిత్రక ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాకు భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. మల్టీ లాంగ్వేజ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

‘స్వయంభు’ కోసం ఏకంగా 175 రోజుల పాటు షూటింగ్ నిర్వహించారు. ఫైనల్ ప్రొడక్ట్‌లో సుమారు 2,500 వీఎఫ్‌ఎక్స్ షాట్స్‌ను పొందుపరుస్తున్నారు. ఈ నెంబర్స్ సినిమా ఏ స్థాయిలో తెరకెక్కుతోందో, ఎంత భారీ టెక్నికల్ వర్క్ జరుగుతోందో తెలియజేస్తున్నాయి. తాజాగా విడుదల చేసిన బిహైండ్ ది సీన్స్ పిక్చర్ సినిమా మేకింగ్‌పై ఆసక్తిని పెంచుతోంది. ఇందులో నిఖిల్ ఇంటెన్స్ వారియర్ అవతార్‌లో యాక్షన్ సీక్వెన్స్‌కు సిద్ధమవుతున్నట్లు కనిపించారు. విజువల్ గ్రాండియర్‌ గా రూపొందుతున్న ఈ చిత్రానికి లెన్తీ ప్రొడక్షన్ షెడ్యూల్ కీలకం. ఫైనల్ అవుట్‌పుట్ విషయంలో రాజీపడకుండా, తాము అనుకున్న స్థాయిలో సినిమాను పూర్తి చేసేందుకు అవసరమైన సమయాన్ని తీసుకుంటున్నారు. 'మంచి విషయాలకు సమయం పడుతుంది. మేం దాదాపు చివరి దశకు చేరుకున్నాం' అంటూ మేకర్స్ తమ కాన్ఫిడెన్స్‌ను వ్యక్తం చేశారు. వారు చెబుతున్న దాని ప్రకారం ఇప్పుడు ‘స్వయంభు’ రిలీజ్ కోసం ఎదురుచూపులు చివరి దశకు చేరుకున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.


ఈ సినిమాకు కేకే సెంథిల్ కుమార్ విజువల్స్ అందిస్తుండగా, రవి బస్రూర్ సంగీతం సమకూర్చుతున్నారు. ప్రొడక్షన్ డిజైనర్లు ఎం. ప్రభాహరన్, రవీందర్ ఈ సినిమా కోసం భారీ ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నారు. నిఖిల్ సరసన సంయుక్త, నభా నటేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ మంచి ఆసక్తిని క్రియేట్ చేయగా, ‘రా రా ధీవర’ ఫస్ట్ సింగిల్ హీరో క్యారెక్టర్‌లోని లార్జర్ దేన్ లైఫ్ నేచర్‌ను చూపిస్తూ సినిమాపై మరింత బజ్‌ను పెంచింది.

ఇవి కూడా చదవండి:

70 ఏళ్ల వయసొచ్చినా.. నచ్చితే రెండో పెళ్లి చేసుకుంటా: ప్రేమ

‘వారణాసి’ కీలక అప్‌డేట్.. ఇంత స్పీడ్ ఏంటి జక్కన్నా?

TFTDDA: జానీ మాస్టర్ వైఫ్ సుమలత స్కెచ్ అదిరిందిగా.. కోర్టు సంచలన తీర్పు

Updated Date - Sep 12 , 2026 | 08:34 PM