NBK111కు ఓటీటీ ఫ్యాన్సీ డీల్.. అప్పుడే సేఫ్‌జోన్‌లోకి
ABN, Publish Date - Jul 15 , 2026 | 08:53 PM
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఉన్న ఫామ్ చూస్తుంటే బాక్సాఫీస్ రికార్డులన్నీ షేక్ అయిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా ఆయన నటిస్తోన్న NBK111 ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్లుగా తెలుస్తోంది.
నందమూరి నటసింహం బాలకృష్ణ (Nandamuri Balakrishna) ప్రస్తుతం ఉన్న ఫామ్ చూస్తుంటే బాక్సాఫీస్ రికార్డులన్నీ షేక్ అయిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ‘అఖండ’ సినిమా నుంచి ‘డాకు మహారాజ్’ వరకు వరుస సినిమాలతో కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ యాక్షన్ హీరో, ఇప్పుడు మరో పవర్‌ఫుల్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న క్రేజీ మూవీ NBK 111. పూర్తి మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో, హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై టాలీవుడ్‌లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
గత నెల బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా విడుదలైన ఈ చిత్ర టీజర్ సోషల్ మీడియాను ఊపేసింది. ఆ గ్లింప్స్ చూసిన అభిమానుల్లో, సినీ వర్గాల్లో సినిమా రేంజ్ ఏంటనేది ఒక క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం ఈ ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. గోపీచంద్ మలినేని మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో పాటు బాలయ్య మార్క్ డైలాగులు థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాలో మరో సర్‌ప్రైజ్ ఎలిమెంట్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. సాధారణ కమర్షియల్ సినిమాల్లా కేవలం పాటలకే పరిమితం కాకుండా, ఈ చిత్రంలో ఆమె పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతోందని సమాచారం. కథను మలుపు తిప్పే ఒక విభిన్నమైన క్యారెక్టర్‌లో కాజల్ కనిపించనుండడం సినిమాకు అదనపు ఆకర్షణ కానుంది. ఇక అసలు విషయానికి వస్తే.. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే బిజినెస్ పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. గత కొంతకాలంగా బాలకృష్ణ సినిమాలకు మార్కెట్‌లో ఊహించని డిమాండ్ ఏర్పడింది. ఇప్పటివరకు ఆయన కెరీర్‌లోనే హయ్యెస్ట్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా ‘డాకు మహారాజ్’ నిలిచింది. ఇప్పుడు ‘NBK 111’ ఆ రికార్డును కూడా చాలా ఈజీగా బ్రేక్ చేస్తుందని ఇండస్ట్రీ టాక్.
దీనికి తగ్గట్టే తాజాగా ఒక సెన్సేషనల్ న్యూస్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ డీల్ అప్పుడే క్లోజ్ అయిపోయిందట. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 (Zee5) ఈ చిత్ర డిజిటల్ రైట్స్‌ను భారీ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు 50 కోట్లకు పైగా భారీ మొత్తాన్ని చెల్లించి ఈ రైట్స్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఓటీటీ లు ఎంత పెద్ద స్టార్ హీరో సినిమాకు అయినా వీలైనంత తక్కువ రేట్లకే సినిమాను చేజిక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. పైగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పెద్ద సినిమాలకు ఓటీటీ బిజినెస్ అనేది అత్యంత కీలకంగా మారింది. అందుకే వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్ర యూనిట్.. థియేట్రికల్ రిలీజ్‌కు ముందే ఓటీటీ రైట్స్ ద్వారా సేఫ్ జోన్‌లోకి వచ్చేలా ప్లాన్ చేసుకుంది. అనుకున్న రేటు రావడంతో డీల్ కూడా ఓకే అయిపోయిందని తెలుస్తోంది. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. బాలయ్య - థమన్ కాంబినేషన్ అంటేనే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాకు కూడా థమన్ అదిరిపోయే రీ-రికార్డింగ్ ప్రిపేర్ చేస్తున్నట్లు సమాచారం. యాక్షన్ సీన్స్ ఎలివేట్ అయ్యేలా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో థియేటర్లు దద్దరిల్లేలా ప్లాన్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
బాలయ్య బిడ్డ తేజస్విని డ్యాన్స్‌ల వెనుక మతలబు ఏంటి? హీరోయిన్‌గా ఏమైనా..
KA13: కిరణ్ అబ్బవరం పుట్టినరోజు స్పెషల్‌గా క్రేజీ మేకింగ్ వీడియో
మరోసారి దిల్ రాజు వర్సెస్ మైత్రీ.. దేవుడిపై భారం వేసిన ఎస్కేఎన్