NBK111: కళ్లజోడు పెట్టిన కాజల్.. బాలయ్య మూవీలో లుక్ వచ్చేసింది
ABN , Publish Date - Jun 19 , 2026 | 11:24 AM
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న NBK111 చిత్రం నుంచి తాజాగా వచ్చిన అప్డేట్ వైరల్ అవుతోంది. ఇందులో కాజల్ అగర్వాల్ లుక్‌ని పరిచయం చేశారు.
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న #NBK111 చిత్రం నుంచి తాజాగా మేకర్స్ వదిలిన అప్డేట్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో చందమామ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) హీరోయిన్‌గా నటిస్తుందని తెలుపుతూ.. ఆమె బర్త్‌డే (HBD Kajal Aggarwal)ని పురస్కరించుకుని శుక్రవారం ఓ పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్‌లో ఈ సినిమాలో ఆమె లుక్‌ని రివీల్ చేశారు. ‘పెద్ది’ బ్యానర్ వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్, హై-వోల్టేజ్ యాక్షన్, గ్రిప్పింగ్ డ్రామాగా ఉండబోతోందని తెలుస్తోంది. ‘వీరసింహారెడ్డి’ తర్వాత బాలయ్య, గోపీచంద్ కాంబోలో మరోసారి వస్తున్న ఈ ప్రాజెక్ట్‌గా ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడొచ్చిన కాజల్ లుక్‌తో మరోసారి ఈ సినిమా వార్తల్లో హైలెట్ అవుతోంది.
ఈ పోస్టర్‌లో కాజల్ అగర్వాల్ ఇదివరకు ఎన్నడూ చూడని విధంగా ఎంతో గంభీరమైన, డీసెంట్ లుక్‌లో కనిపిస్తున్నారు. నీలిరంగు గళ్ళ చీర కట్టుకుని, కళ్ళద్దాలు పెట్టుకుని, జుట్టును వెనక్కి ముడివేసిన ఆమె రూపం ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వ అధికారిణిగా లేదంటే.. ఒక పవర్‌ఫుల్ లాయర్ పాత్రలోనో ఉండబోతోందనే సంకేతాలను ఇస్తోంది. ఆమె వెనుక ఉన్న పాతకాలపు ఆఫీస్ వాతావరణం, టేబుల్‌పై ఉన్న ఫైళ్లు, స్టాంపులు చూస్తుంటే కథలో ఆమె పాత్ర ఎంతో కీలకమైనదిగా, ఇంటెన్సివ్‌గా సాగుతుందని అర్థమవుతోంది. గ్లామర్ పాత్రలకు భిన్నంగా కాజల్ నటిస్తున్న ఈ నటనకు ప్రాధాన్యమున్న పాత్ర సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక ఈ సినిమాకు సంబంధించి బాలయ్య పుట్టినరోజు స్పెషల్‌గా విడుదల చేసిన ‘ఎంట్రీ ఆఫ్ ఆన్ ఎరా’ గ్లింప్స్ ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది. నటసింహం పాత్రను పరిచయం చేస్తూ వచ్చిన ఈ గ్లింప్స్‌లో.. 1993 బాంబే అల్లకల్లోల పరిస్థితుల నేపథ్యంలో సాగే డార్క్, హింసతో నిండిన ప్రపంచాన్ని చూపించారు. అలాంటి పరిస్థితుల్లో స్టైల్, ఇంటెన్స్, పవర్‌కు ప్రతీకగా బాలకృష్ణ ఎంట్రీ అదిరిపోయింది. డైలాగ్స్ లేకుండానే విజువల్స్ ద్వారా పాత్ర పవర్‌ను అద్భుతంగా చూపించారు. ఎస్. థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గ్లింప్స్‌కు మరింత ఊపునిచ్చింది. సినిమా స్థాయి, నిర్మాణ విలువలు చాలా గ్రాండ్‌గా కనిపించాయి. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తోన్న ఈ మూవీ.. కచ్చితంగా బాలయ్య సక్సెస్ రికార్డ్‌ను కంటిన్యూ చేస్తుందని ఫ్యాన్స్ ఎంతో ఆశతో ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
‘మకుటం’ ఫస్ట్ సింగిల్ అప్డేట్.. అందుకే ఆలస్యమైంది!
డిప్యూటీ సీఎంగా లారెన్స్.. అభిమానులతో జాగ్రత్త!
రౌడీ హీరో విజయ్ దేవరకొండ రేర్ ఫీట్.. గ్లోబల్ రేంజ్ అంటే ఇది!