NBK111: సింహం ఈసారి స్టైలిష్ గా దిగింది.. ఇక విధ్వంసమే

ABN , Publish Date - Jun 10 , 2026 | 06:03 PM

నందమూరి నట సింహం, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.

NBK 111

నందమూరి నట సింహం, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. వారితో పాటు బాలయ్య నటిస్తోన్న కొత్త చిత్రాల మేకర్స్ సైతం.. గ్లింప్స్ లు రిలీజ్ చేస్తూ బాలయ్యకు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య నటిస్తోన్న చిత్రాలలో NBK111 ఒకటి. సక్సెస్‌ఫుల్ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని వహిస్తోన్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.


ఇప్పటికే బాలయ్య - గోపీచంద్ మలినేని కాంబోలో వీరసింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా వచ్చింది. దీని తరువాత వీరి కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అభిమానులు భారీగా అంచనాలను పెట్టుకున్నారు. గోపీచంద్ మలినేని సైతం ఆ అంచనాలకు ఎక్కడా తగ్గకుండా గ్లింప్స్ ని రిలీజ్ చేసి మారినాథ్ హైప్ అందించాడు. గ్లింప్స్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. ఎప్పుడు మాస్ లుక్ లో ఉన్న బాలయ్యను చూసిన అభిమానులకు ఈసారి గోపీచంద్ క్లాస్ లుక్ లో ఉన్న బాలయ్యను చూపించి షాక్ ఇచ్చాడు.


హెవీ బైక్‌పై చేతిలో సిగరెట్ కాలుస్తూ బాలకృష్ణ ఇచ్చిన ఎంట్రీ, స్టైలిష్ గడ్డం, మీసాలతో ఉన్న ఆయన లుక్ అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంది. కేవలం ఒకటిన్నర నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోలో చేతికి భారీ ఇనుప గొలుసులు చుట్టుకుని బాలయ్య విలన్లను వేటాడే యాక్షన్ సీన్లు, భారీ గన్‌తో కాల్పులు జరిపే విజువల్స్ అరాచకంగా డిజైన్ చేశారు. ఇక ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గ్లింప్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లగా, అరవింద్ ఎస్. కశ్యప్ విజువల్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి. టోటల్ గా ఈ గ్లింప్స్ తో ఈసారి బాలయ్య చేసే విధ్వంసం వేరే లెవెల్ అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మరి ఈ సినిమాతో బాలయ్య - గోపీచంద్ మరో హిట్ ను అందుకుంటారో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి:

భారతీరాజా అంత్యక్రియల్లో తీవ్ర కలకలం.. బంధువులపై సింగర్ ఆగ్రహం

కన్నీళ్ళు పెట్టిస్తోన్న భారతీరాజా చివరి వీడియో..

Drishyam 3: అందుకే.. వెంక‌టేశ్‌తో దృశ్యం 3 రీమేక్ చేయలేదు! అస‌లు గుట్టు.. బ‌య‌ట పెట్టిన డైరెక్ట‌ర్‌

Updated Date - Jun 10 , 2026 | 06:41 PM