‘మకుటం’ ఫస్ట్ సింగిల్ అప్డేట్.. అందుకే ఆలస్యమైంది!

ABN , Publish Date - Jun 19 , 2026 | 10:36 AM

సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మాణంలో.. విశాల్ హీరోగా నటిస్తూ.. దర్శకత్వం వహిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘మకుటం’. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ జూన్ 16న విడుదల కావాల్సి ఉండగా, వాయిదా పడింది. అందుకు కారణం ఏమిటో విశాల్ తెలిపారు.

Makutam Movie Update

సూపర్ గుడ్ ఫిలిమ్స్ (Super Good Films) నిర్మాణంలో.. విశాల్ (Vishal) హీరోగా నటిస్తూ.. దర్శకత్వం వహిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘మకుటం’ (Makutam). సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో 99వ సినిమాగా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్‌డేట్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. వాస్తవానికి ఈ సినిమాలోని మొదటి పాట జూన్ 16న విడుదల కావాల్సి ఉంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కానీ, ఆ తేదీన పాట విడుదల కాలేదు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ పాట విడుదలను వాయిదా వేస్తున్నట్లు దర్శకుడు విశాల్ అధికారికంగా ప్రకటించారు.


ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ‘‘కొన్నిసార్లు ఒక అద్భుతమైన పాట ప్రపంచానికి పరిచయం కావడానికి ముందు, దానికి మరికొంత సమయం, ప్రేమ అవసరమవుతాయి. అందుకే మా ఫస్ట్ సింగిల్‌ను వాయిదా వేస్తున్నాం. ఈ పాటను జూన్ 19న (నేడు) ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం’’ అని దర్శక హీరో విశాల్ ఈ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఆలస్యానికి క్షమాపణలు చెబుతూనే, ప్రేక్షకులు వేచి ఉన్న సమయానికి తగ్గట్టుగానే సంగీతం అత్యంత అద్భుతంగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.


‘‘సహనంతోనే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. కేవలం విడుదల తేదీ మాత్రమే మారింది కానీ, సినిమాపై ఉన్న అంచనాలు, ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. ఏ మాస్టర్‌పీస్ అయినా అది పూర్తిగా సిద్ధమైనప్పుడే బయటకు వస్తుంది’’ అంటూ దర్శకుడు విశాల్ ఈ ప్రకటనలో రాసుకొచ్చారు. ఈ చిత్రం జూలై 2026లో థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతోంది. విశాల్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీలో దుషార విజయన్, అంజలి, తంబి రామయ్య, అర్జై తదితరులు ఇతర కీలక పాత్రలను పోషిస్తున్నారు. రవి అరసు ఈ చిత్రానికి కథను సమకూర్చారు.

ఇవి కూడా చదవండి:

డిప్యూటీ సీఎంగా లారెన్స్.. అభిమానులతో జాగ్రత్త!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ రేర్ ఫీట్.. గ్లోబల్ రేంజ్ అంటే ఇది!

వెంకీ, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి సినిమాకు క్లాప్ ఎవరు కొట్టారంటే

Updated Date - Jun 19 , 2026 | 10:36 AM

Makutam Teaser: మాటల్లేవ్.. ఆ ఫస్ట్ షాట్ ఒక్కటి చాలు!

Makutam: విశాల్ కొత్త మూవీ.. టైటిల్ భలే ఉందే

Vishal - Dhansika: పెళ్లి ఆలస్యం ఎందుకంటే.. ధన్సిక కూడా సై అంది

Vishal 35: సూపర్ గుడ్ ఫిలిమ్స్ నుండి 99వ చిత్రం...

Vishal : 'మకుటం' సెట్స్ కు శింబు తండ్రి రాజేందర్