Kalki 2: 51 ఏళ్ల తర్వాత తెలుగు ఎంట్రీ?

ABN , Publish Date - Sep 24 , 2026 | 11:03 AM

ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్‌పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఏ వార్త బయటకు వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతుంటుంది.

Naseeruddin Shah

ప్రభాస్ (Prabhas) హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2) సీక్వెల్‌పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఏ వార్త బయటకు వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా ఈ సినిమాలో భాగం కానున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ కీలక పాత్ర కోసం  నసీరుద్దీన్ షాను ఎంపిక చేసినట్లు  తెలిసింది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ ఈ వార్త నిజమైతే.. దాదాపు 51 ఏళ్ల సినీ కెరీర్‌లో నసీరుద్దీన్ షా తొలిసారి  తెలుగు సినిమాలో కనిపించనున్నట్టవుతుంది. హిందీతో పాటు పలు భాషల చిత్రాల్లో నటించిన ఆయన.. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ తనదైన ముద్ర వేశారు. అలాంటి నటుడు ‘కల్కి 2’లో భాగమైతే సినిమాకు మరింత ప్రత్యేకత చేకూరే అవకాశం ఉంది. 

‘కల్కి 2’ విషయానికి వస్తే..

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ సీక్వెల్ ఇప్పటికే షూటింగ్ దశలో ఉంది. సెప్టెంబర్‌లో నాగ్ అశ్విన్ ఇచ్చిన అప్‌డేట్ ప్రకారం ఇప్పటివరకు దాదాపు 10 రోజుల షూటింగ్ పూర్తయింది. ప్రభాస్ తన ప్రస్తుత కమిట్‌మెంట్స్ పూర్తి చేసిన తర్వాత మరింత సుదీర్ఘమైన షెడ్యూల్‌లో షూటింగ్ కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. తాజా  సమాచారం ప్రకారం ‘కల్కి 2’ షూటింగ్ దాదాపు 30 శాతం పూర్తయినట్లు తెలిసింది. గతంలో ఈ సినిమాలో ఓ పాన్ ఇండియా నటుడు కీలక [పాత్ర పోషించనున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఆ  నటుడి పేరు అధికారికంగా వెల్లడించలేదు. ఇప్పుడు ఆ నటుడు నసీరుద్దీన్ షానే కావచ్చని టాక్ నడుస్తోంది. 

ఇవి కూడా చ‌ద‌వండి

రామ్ చరణ్-సుకుమార్ RC17పై క్రేజీ అప్‌డేట్

ది పార‌డైజ్.. సోష‌ల్ మీడియా టాక్‌! చూస్తే.. ఏమైపోతారో

హీరోయిన్ కాదు.. రాకాలో రష్మికకు భారీ ట్విస్ట్?

రూ.5 లక్షల మోసం.. బిగ్‌బాస్ వర్షిణి అరెస్టు

మామ కోసం అల్లుడి త్యాగం.. రేసు నుంచి త‌ప్పుకున్న ఓం

యంగ్‌ లుక్‌లో మహేశ్‌?.. ‘వారణాసి' షూటింగ్ పూర్తి

Updated Date - Sep 24 , 2026 | 01:26 PM