సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

The Paradise: ఓటీటీలోకి నాని ‘ది పారడైజ్.. ఎప్పుడు.. ఎక్కడ..  

ABN, Publish Date - Oct 18 , 2026 | 12:50 PM

నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నటించిన ‘ది పారడైజ్’ (The Paradise) సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.

నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నటించిన ‘ది పారడైజ్’ (The Paradise) సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. థియేటర్లలో ప్రేక్షకులను  అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది.  అక్టోబర్ 22 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సదరు సంస్థ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. నాని, కాయదు లోహర్ జంటగా నటించిన ఈ చిత్రానికి ఓదెల శ్రీకాంత్ దర్శకత్వం వహించారు. మోహన్ బాబు కీలక పాత్ర పోషించారు.  నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా ఈ చిత్రం అందుబాటులోకి రానుండటంతో నాని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

కథ :

ఇది దేశానికి స్వాతంత్రం వచ్చి మూడున్నర దశాబ్దాలు గడిచినా గుర్తింపుకు నోచుకోని ఐదు వేలమంది సవారీల కథ. హైదరాబాద్‌లోని దొరలు వాళ్ళతో దొంగసారా కాయించి, పబ్బం గడుపుకుంటారు తప్పితే... కనీసం వాళ్ళను మనుషులుగా చూడరు. వాళ్ళు వైద్యం, విద్య వంటి కనీస హక్కులకు కూడా నోచుకోరు. అలాంటి వారిని జాగృతం చేసి షికంజా మాలిక్ (మోహన్‌ బాబు) నుంచి విముక్తి కలిగించడానికి సమ్మక్క (సోనాలీ కులకర్ణి) నడుం కడుతుంది. మాలిక్‌ దాష్టికానికి, ఆమె కవలల పిల్లలను కంటే అందులో ఆడపిల్ల పురిటీలోనే కన్నుమూస్తుంది. దాంతో కొడుకునే కూతురిలా జడలు వేసి పెంచుతుంది. అతనే జడల్‌ (నాని)! అయితే తల్లి ప్రవర్తన సరైనది కాదని జనమంతా అంటుంటే... అదే నిజమని నమ్మి ఆమె మీద ద్వేషం పెంచుకుంటాడు జడల్‌. చిన్న వయసులోనే ఓ హత్య చేసి పద్నాలుగేళ్ళు జైలు శిక్ష అనుభవిస్తాడు. జైలు నుంచి తిరిగి వచ్చినా... తన వాళ్ళ జీవితాలు మారలేదని తెలిసిన జడల్‌ వారి కోసం మాలిక్‌ తోనూ, అతని కొడుకు చోటా మాలిక్‌ తోనూ ఎలా తలపడ్డాడు? తన తల్లి త్యాగాన్ని ఎలా గుర్తించి, ఆమెను గౌరవించాడు? సవారీలు ఈ దేశంలో భాగమేననే గుర్తింపు తీసుకు రావడానికి ఏ రాజకీయ నాయకుడు నడుం బిగించాడు? అనేది 'ది ప్యారడైజ్‌' కథ.

Updated Date - Oct 18 , 2026 | 01:07 PM