Bathukamma: తెలంగాణ పండుగ పాటకి స్టెప్పులేసిన సల్మాన్ ఖాన్

ABN , First Publish Date - 2023-03-31T13:14:58+05:30 IST

తెలంగాణ ప్రజలు సంబరంగా జరుపుకునే బతుకమ్మ పండుగ ఇప్పుడు సల్మాన్ ఖాన్ హిందీ సినిమాలో చోటు చేసుకుంది. ఈ పాటలో తెలుగు నటుడు వెంకటేష్, పూజ హెగ్డే కూడా కనపడనున్నారు. ఇంతకీ ఈ బతుకమ్మ పాట ఎలా ఈ సినిమాలోకి వచ్చింది అంటే...

Bathukamma: తెలంగాణ పండుగ పాటకి స్టెప్పులేసిన సల్మాన్ ఖాన్

తెలంగాణ పండుగ బతుకమ్మ (Bathukamma) ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో వెళుతోంది. సల్మాన్ ఖాన్ (Salman Khan), వెంకటేష్ (Venkatesh), పూజ హెగ్డే (Pooja Hegde) నటిస్తున్న హిందీ సినిమా 'కిసి క భాయ్ కిసి కి జాన్' (Kisi Ka Bhai Kisi Ka Jaan) సినిమా నుండి ఈ బతుకమ్మ పాటను విడుదల చేశారు. బతుకమ్మ పండుగను తెలంగాణాలో (Telangana) ఎంతో సంబరంగా తొమ్మిది రోజులపాటు జరుపుకుంటారు. ఈ పండగ ని పువ్వుల పండగ అని కూడా అంటారు, ఎందుకంటే ఎక్కువగా పువ్వులతో డెకరేట్ చేస్తారు కాబట్టి.

ఈ సినిమా నుండి విడుదల అయిన ఈ పాటలో సల్మాన్ ఖాన్, వెంకటేష్, పూజహెగ్డే అందరూ తెలుగు తనం ఉట్టి పడే విధంగా అవుట్ ఫైట్స్ కట్టుకొని కనబడతారు. సల్మాన్ ఖాన్ తనకి ఈ బతుకమ్మ సంబరాలు అంటే ఎంత ఇష్టమో ఈ సినిమాలో ఈ పాట ద్వారా చెప్పాడు. ఈ పాట ఈ సినిమాలో హైలైట్ అవుతుందని కూడా ఈ సినిమా నిర్వాహకులు నమ్ముతున్నారు. తెలంగాణ సంప్రదాయం, సంస్కృతికి అద్దం పెట్టె విధంగా ఈ పాట వుండబోతోంది అని కూడా తెలుస్తోంది. 200 మంది డాన్సర్స్ తో ఈ పాటను కోరియోగ్రఫీ చేశారు. ఇందులో ఆధునిక సంగీతాన్ని కూడా మిక్స్ చేసి, తెలంగాణ బతుకమ్మకు సంబదించిన పాటగా తయారుచేశారు. తెలంగాణ బతుకమ్మ పండగకి, అలాగే తెలంగాణా ప్రజలకి ఈ పాట ఒక ట్రిబ్యూట్ (Tribute to Bathukamma) లాంటిదని కూడా చెపుతున్నారు. ఈ బతుకమ్మ పాటకి సంగీతం రవి బస్రూర్ (Ravi Basrur) సమకూర్చగా, సంతోష్ వెంకీ, ఉడుపి, హరిణి ఇవటూరి, సుచేత బస్రూర్, విజయలక్ష్మి ఈ పాటకి గొంతునిచ్చారు. ఇందులో కొన్ని తెలుగు పదాలు కూడా వుంటాయని తెలిసింది.

bathukamma.jpg

ఇంతకీ ఈ పాటని ఎవరు సజెస్ట్ చేశారో తెలుసా? మన వెంకీ మామ (Venky Mama) ఒక బతుకమ్మ పాట పెడదాం అని సల్మాన్ ఖాన్ కి చెప్పగానే, వెంటనే సల్మాన్ ఖాన్ ఒప్పుకున్నాడని తెలిసింది. ఈ సినిమా కి దర్శకుడు ఫర్హాద్ సంజి (Farhad Samji) కాగా ఈ సినిమాని సల్మాన్ ఖాన్ (Salman Khan) తన ప్రొడక్షన్ హౌస్ నుండి ప్రొడ్యూసర్ చేస్తున్నాడు.

ఈ పాట ని తెలంగాణ బి.ఆర్.ఎస్. ఎం.ఎల్.సి. కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) కూడా ట్వీట్ చేసింది. బతుకమ్మ (#Bathukamma) క్రేజ్ పాన్ ఇండియా లెవెల్ లో వుంది అని ఆమె ట్వీట్ చేశారు.

Updated Date - 2023-03-31T13:16:17+05:30 IST