సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘అలియాస్ రుక్మిణీ’లో నితిన్‌ని చూసి నేనే ఆశ్చర్యపోయా: నాని

ABN, Publish Date - Nov 29 , 2026 | 05:27 PM

యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డిఫరెంట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌‌గా రూపుదిద్దుకున్న ‘అలియాస్ రుక్మిణీ’ చిత్రాన్ని నేచురల్ స్టార్ నాని సమర్పిస్తోన్న విషయం తెలిసిందే.

Natural Star Nani

యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డిఫరెంట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌‌గా రూపుదిద్దుకున్న ‘అలియాస్ రుక్మిణీ’ (Alias Rukmini)ని నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) సమర్పిస్తోన్న విషయం తెలిసిందే. నితిన్ (Nithiin) హీరోగా నటిస్తోన్న ఈ సినిమాకు ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్నారు. దీప్తి గంటా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 4న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబైంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్‌ను యమా జోరుగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా మేకర్స్ ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మూవీ ప్రజెంటర్ నాని మాట్లాడుతూ.. ‘‘మా టీమ్ అందరూ చాలా ఎమోషనల్‌గా వాళ్ల మూమెంట్స్ షేర్ చేసుకున్నారు. మా అందరికీ కూడా ఇది చాలా స్పెషల్ ఫిల్మ్. ఒక నిర్మాతగా ఈ సినిమా నాకు చాలా ఆనందాన్నిచ్చింది. సినిమా చాలా బ్యూటిఫుల్‌గా వచ్చింది. కంటెంట్ విషయంలో చాలా తృప్తిగా, ఆనందంగా ఉన్నాను. రిలీజ్‌కు ముందు ఎలాంటి టెన్షన్ లేదు. అందరితో కలిసి ఈ సినిమా చూడటానికి ఎంతగానో ఎదురుచూస్తున్నాను. డిసెంబర్ 3వ తేదీ రాత్రి నుంచే ప్రీమియర్స్ ఉంటాయి. అక్కడి నుంచి సెలబ్రేషన్స్ మొదలుకాబోతున్నాయి.


మురళి ఫెంటాస్టిక్ రైటర్, డైరెక్టర్. తనకంటూ ఒక ఒరిజినల్ వాయిస్ ఉంది. నేను కథ విన్నప్పుడు సినిమా ఎంత బాగుంటుందో అనుకున్నాను. దానికంటే మరింత బ్యూటిఫుల్‌గా సినిమాను తీసిచ్చాడు. విజయ్ సినిమాకు ఇచ్చిన మ్యూజిక్, ప్రతి సీన్‌ను ఎలివేట్ చేసిన విధానం చాలా బలంగా ఉంటుంది. మా వాల్ పోస్టర్ టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. దీప్తి అక్క నాకు బలం. ఇది తన ప్రారంభం మాత్రమే. ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలతో తను అందరి ప్రేమాభిమానాలను గెలుచుకుంటుంది. ఆఫియా అద్భుతమైన నటి. రుక్మిణి పాత్రలో అద్భుతంగా చేసింది. ఈ సినిమా విడుదల తర్వాత ఆమెకు చాలా మంచి పేరు వస్తుంది. సాయికుమార్ సార్ నా ఫేవరెట్ పర్సన్. నా ప్రతి సినిమాకు మొదటి బ్లెస్సింగ్స్ ఆయన దగ్గరి నుంచే వస్తాయి. అలాగే ఈ సినిమాలో పనిచేసిన హర్షతో పాటు మిగతా నటీనటులందరూ బ్యూటిఫుల్‌గా చేశారు. ఈ సినిమాలో ఇంకా ఇద్దరు ముగ్గురు సర్‌ప్రైజింగ్‌గా ఉంటారు. చూస్తే చాలా ఎంజాయ్ చేస్తారు.

థాంక్యూ నితిన్. ఈ సినిమాలో చాలా స్పెషల్‌గా చేశారు. 20 ఏళ్లుగా తనతో పరిచయం ఉన్న నేనే.. ఈ సినిమా చూసి సర్‌ప్రైజ్ అయ్యాను. తను ఎంత అద్భుతమైన నటుడో ఈ సినిమాతో అందరికీ అర్థమవుతుంది. డిసెంబర్ 4న వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కమ్‌బ్యాక్స్ ఆఫ్ ది ఇయర్ అవుతుందని నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. సినిమా చూసిన తర్వాత చాలా మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. కృష్ణ పాత్రలో నితిన్ తప్ప ఇంకొకరిని నేను ఊహించుకోలేకపోయాను. ఈ సినిమాను నేను ప్రొడ్యూస్ చేయకుండా నేరుగా థియేటర్‌లో చూసి ఉంటే, కచ్చితంగా చాలా పెద్ద ట్వీట్ రాసి, ఆ టీమ్‌కు ఫోన్ చేసి, ‘నేను ప్రమోషన్స్‌కు ఏమైనా పనికొస్తానా?’ అని అడిగేవాడిని. అలాంటి సినిమా ఇది. ఈ సినిమాలో భాగం కావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను.


మీ భర్తను ఈ సినిమాకు తీసుకెళ్తే, సినిమా చూసి తిరిగి వచ్చేటప్పటికీ.. మీకు ఒక పర్సనల్ విన్‌లా అనిపిస్తుంది. అలాగే భర్త తన భార్యను సినిమాకు తీసుకెళ్తే, సినిమా చూసి ఇంటికి వచ్చేసరికి మీరు రెండు పాయింట్లు స్కోర్ చేసినట్టే. పదేళ్లు దాటిన మీ పిల్లలను తీసుకెళ్తే, ఒక మంచి సినిమా చూపించామనే సంతృప్తి కచ్చితంగా ఉంటుంది. ఈ సినిమాలో చాలా అందమైన మ్యాటర్ ఉంది. తప్పకుండా అందరూ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని బలంగా నమ్ముతున్నాను..’’ అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

సమంత, త్రిష, స్నేహ, మృణాళిని‌లకు అతడి చీర కట్టు.. అదుర్స్

నాని కోసం గొడుగు పట్టిన నితిన్.. 20 ఏళ్ల నాటి ఆసక్తికర ఘటన

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సూపర్ స్టార్.. ఏంటి విషయం?

Updated Date - Nov 29 , 2026 | 05:27 PM