‘అలియాస్ రుక్మిణీ’లో యంగ్ కృష్ణగా నితిన్.. ఆసక్తి పెంచుతున్న కొత్త గ్లింప్స్!

ABN , Publish Date - Nov 07 , 2026 | 04:39 PM

నితిన్‌, ఆఫియా సయ్యద్‌ జంటగా నటిస్తున్న ‘అలియాస్ రుక్మిణీ’ సినిమా నుంచి యంగ్ కృష్ణగా నితిన్‌ కనిపించిన కొత్త ప్రమోషనల్ వీడియో విడుదలైంది. మురళీకాంత్‌ దేవసోత్‌ దర్శకత్వంలో నాని సమర్పణలో దీప్తి ఘంట నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌పై ఆసక్తి పెరుగుతోంది.

Alias Rukmini Movie

నితిన్‌, ఆఫియా సయ్యద్‌ జంటగా నటిస్తున్న సినిమా 'అలియాస్‌ రుక్మిణీ'. సాయి కుమార్, హర్షవర్థన్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను 'దండోరా' ఫేమ్‌ మురళీకాంత్‌ దేవసోత్‌ తెరకెక్కిస్తున్నారు. నాని సమర్పణలో అతని సోదరి దీప్తి ఘంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విజయ్‌ బుల్గానిన్ సంగీతం అందిస్తున్న 'అలియాస్ రుక్మిణీ' నుంచి ఇప్పటి వరకూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌ మూవీపై ఆసక్తిని పెంచుతూ పోయింది. తాజాగా ఈ సినిమా కోసం యంగ్‌ కృష్ణ గెటప్‌లో నితిన్‌ దర్శనమిచ్చారు.


కృష్ణ ఇంటికి రుక్మిణీని తీసుకొచ్చి, అతని గురించి దర్శకుడు మురళీకాంత్‌ వివరించే వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఇంతలో కృష్ణ పాత్రధారి నితిన్‌ ఎంట్రీ ఇవ్వడంతో అతని మేకోవర్‌ చూసి ఆఫియా స్టన్ అయ్యింది. రుక్మిణీ అతనికి ప్రపంచం కాకముందు... ఓ కలల కృష్ణ ఉండేవాడు అంటూ ఈ వీడియోను రిలీజ్‌ చేశారు. ఇందులో నితిన్ యంగ్‌ బోయ్‌గా దర్శన మిస్తున్నాడు. ఇందులో రుక్మిణి పాత్రను డెవిల్‌ అని పిల్లలు పిలుచుకునే స్కూల్‌ టీచర్‌గా చూపించారు. ఆమె జీవితంలోకి 10 ఏళ్ల క్రితం ఒక కలలు కనే యువకుడిగా కృష్ణ ఎలా వచ్చాడనేది కథ.


'కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ' మూవీ తర్వాత నాని యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో తెరకెక్కించిన మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. ఈ చిత్రానికి జోమోన్‌ టి. జాన్‌ సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, అవినాశ్‌ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా సేవలందిస్తున్నారు. ప్రశాంత్‌ మండవ ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌. 'అలియాస్ రుక్మిణీ' డిసెంబర్ 4న జనం ముందుకు రాబోతోంది.

ఇవి కూడా చదవండి:

వెంకీ విక్టరీకి అనిల్ రావిపూడినే దిక్కా..?

ఎట్టకేలకు ‘హనుమాన్ అంశ్’ ఓటీటీకి.. ఎప్పుడంటే

నన్ను ఎంత తక్కువగా అంచనా వేస్తే.. అంతగా గెలిచి చూపిస్తా: ధనుష్

Updated Date - Nov 07 , 2026 | 04:51 PM