సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Bhairava dweepam: బాలయ్య పుట్టినరోజు స్పెషల్‌.. ఇదే..

ABN, Publish Date - May 29 , 2026 | 03:16 PM

గత రెండు, మూడేళ్లగా టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్‌ బాగా నడుస్తోంది. పాత చిత్రాలను డిజిటలైజ్‌ చేసి, సౌండ్‌, విజువల్స్‌ను రీ మాస్టర్‌ చేసి సినిమాలను విడుదల చేస్తున్నారు.

గత రెండు, మూడేళ్లగా టాలీవుడ్‌లో రీ-రిలీజ్‌ల ట్రెండ్‌ బాగా నడుస్తోంది. పాత చిత్రాలను డిజిటలైజ్‌ చేసి, సౌండ్‌, విజువల్స్‌ను రీ-మాస్టర్‌ చేసి విడుదల చేస్తున్నారు. అప్పట్లో బాగా ఆడిన సినిమాలు ఇప్పుడూ బాక్సాఫీస్‌ దగ్గర సత్తా చాటుతున్నాయి. ప్రతి నెల, ప్రత్యేక రోజుల్లో ఏదో ఒక చిత్రం రీ-రిలీజ్‌ అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే మురారి, పోకిరి, జల్సా, ఘరానా మొగుడు, బిల్లా, చెన్నకేశవ రెడ్డి, ఖుషీ, సింహాద్రి, తొలిప్రేమ, బిజినెస్‌మేన్‌ వంటి ఎన్నో చిత్రాలు రీ-రిలీజై బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించాయి.

ఇప్పుడు నందమూరి బాలకృష్ణ (NBK) నటించిన క్లాసిక్‌ సినిమా ‘భైరవ ద్వీపం’ (Bhairavadweeepam)ను రీ రిలీజ్‌ చేస్తున్నారు. బాలయ్య పుట్టినరోజు సందర్బంగా జూన్‌ 10న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సింగీతం శ్రీనివాస రావు తెరకెక్కించిన సినిమా ఇది. రోజా కథానాయిక. ఈ సినిమా రీ-రిలీజ్‌ ప్రకటన రాగానే అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది.

ఇది కూడా చదవండి:

Blast Zone : అర్జున్ సర్జా బ్లాస్ట్ జోన్ మూవీ రివ్యూ

System Movie Review: సోనాక్షి సిన్హా, జ్యోతిక 'సిస్టమ్‌' ఓటీటీ మూవీ రివ్యూ

Updated Date - May 29 , 2026 | 03:32 PM