సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Jailer2: ‘జైలర్ 2’ టికెట్‌ ధరలపై విమర్శలు.. నాగవంశీ కీలక వ్యాఖ్యలు!

ABN, Publish Date - Oct 17 , 2026 | 05:13 PM

'జైలర్ 2' (Jailer 2) టికెట్ రేట్ల పెంపుపై వస్తున్న కామెంట్లను నాగవంశీ ఖండించారు.

'జైలర్ 2' (Jailer 2) టికెట్ రేట్ల పెంపుపై వస్తున్న కామెంట్లను నాగవంశీ ఖండించారు. ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం తమకు లేదన్నారాయన. రజనీకాంత్9Rajinikanth) , నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో రూపొందిన  'జైలర్ 2' సినిమాను ఆయన తెలుగులో విడుదల చేశారు.  సన్‌ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ అక్టోబర్ 15న  ప్రేక్షకుల ముందుకొచ్చింది. మొదటి షో నుంచే  పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా నాగవంశీ సినిమా సక్సెస్ పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ మీడియా తో మాట్లాడారు. ''జైలర్ 2' సినిమాను భారీ రేటు పెట్టి తీసుకున్నామని భయపడ్డారు. కానీ, అక్టోబర్ 15 సాయంత్రం షోల వసూళ్లు చూసిన తర్వాత ఖచ్చితంగా కమిషన్ వస్తుందని డిస్ట్రిబ్యూటర్లు చెప్పారు.

రజనీకాంత్, నెల్సన్, అనిరుధ్ ను  నమ్మి రిస్క్ చేసి సినిమా తీసుకున్నాం. దానికి ప్రతిఫలం దక్కుతుండటం చాలా సంతోషంగా ఉంది. మేము నిర్మించిన సినిమా అయినా, పంపిణీ చేసిన సినిమా అయినా డిస్ట్రిబ్యూటర్లకు కమిషన్ వస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో డిస్ట్రిబ్యూటర్లకు కమిషన్ రావడం అనేది అరుదై పోయింది. ఏపీలో ప్రతి షోకి కలెక్షన్లు పెరుగుతున్నాయి. ఈ విజయదశమి నాటికి నైజాంలో బ్రేక్ ఈవెన్ పూర్తవుతుంది’’ అని అన్నారు. 

ఇవి కూడా చదవండి:

దీపావళి రేసులో సూర్య, నయనతార.. విజేత ఎవరు?

‘బాషా’, ‘మాస్టర్’, ‘తొలిప్రేమ’ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత

కావ్య మారన్‌తో పెళ్లి.. తెలుగువాళ్లకి అనిరుధ్ మరింత దగ్గర కాబోతున్నాడా?

Updated Date - Oct 17 , 2026 | 05:52 PM