Naga Vamshi: చాలా రోజుల తర్వాత.. నా ఈగో సాటిస్‌ఫైడ్

ABN , Publish Date - Jan 17 , 2026 | 07:29 AM

ఆరేళ్ల తర్వాత సంతృప్తి ఇచ్చిన విజయమని, నా ఈగో సాటిస్‌ఫై అయింద‌ని నిర్మాత సూర్యదేవర నాగ వంశీ చెప్పారు.

Naga Vamshi

'అనగనగా ఒక రాజు' చిత్రంతో భారీ హిట్ కొట్టానని, ఇది తనకు ఆరేళ్ల తర్వాత సంతృప్తిని ఇచ్చిన విజయమని, చాలా రోజుల తర్వాత.. నా ఈగో సాటిస్‌ఫై అయింద‌ని సామాజిక మాధ్యమాల ద్వారో ఎంతో మద్దతు తెలిపిన అభిమానులు సంతోషపడేలా త్వరలో భారీ ప్రకటన చేస్తానని నిర్మాత సూర్యదేవర నాగ వంశీ (Naga Vamshi) చెప్పారు.

నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty), మీనాక్షి చౌదరి (Meenaakshi Chaudhary) జంటగా నూతన దర్శకుడు మారి తెరకెక్కించిన చిత్రం అన‌గ‌న‌గా ఒక రాజు (Anaganaga Oka Raju). శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. సినిమా ఇటీవలే విడుదలైన సందర్భంగా చిత్రబృందం థాంక్స్ మీట్ వేడుకను నిర్వహించింది.

ఈ సందర్భంగా నాగవంశీ మాట్లా డుతూ 'అల వైకుంఠపురంలో' సినిమా తర్వాత ఆ స్థాయి సంతృప్తినిచ్చిన సంక్రాంతి ఇది. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు' అని అన్నారు. హీరో నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ 'ఇందులో వినోదంతో పాటు మంచి భావోద్వేగాలను కూడా అందించాలని అను కున్నాము. నాకు రాజ్ కుమార్ హిరాని గారి సిని మాలంటే ఇష్టం. తెలుగులో అలాంటి సినిమా చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేశాం' అని అన్నారు. కార్యక్రమంలో దర్శకుడు మారి, కథానా యిక మీనాక్షి చౌదరి, నటుడు రావు రమేశ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 17 , 2026 | 07:39 AM