సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘ముసలోడికి దసరా పండుగ’.. ఎప్పుడంటే?

ABN, Publish Date - May 13 , 2026 | 04:47 PM

ప్రేక్షకులు థియేటర్లకు వస్తే.. రెండు గంటల పాటు కష్టాలన్నీ మర్చిపోయి హాయిగా నవ్వుకునేలా ‘ముసలోడికి దసరా పండుగ’ చిత్రం ఉంటుందని అన్నారు చిత్ర నిర్మాత రమణ వాళ్లె.

Musalodiki Dasara Panduga Movie Poster

రాజీ నాయుడు - సీత‌మ్మ వాళ్లె ఆశీస్సుల‌తో రమణా ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై తెలుగులో వస్తోంది 'ముసలోడికి దసరా పండగ' (Musalodiki Dasara Panduga) చిత్రం. 2011లో తమిళంలో విడుదలైన 'మహారాజా' చిత్రాన్ని రమణ వాళ్లె తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. విలక్షణ నటుడు నాజర్ (Nassar) ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఈ శుక్ర‌వారం (మే 15న‌) థియేట‌ర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌తో.. వార్తలలో నిలిచిన ఈ చిత్రం.. నాన్‌స్టాప్ నవ్వులు పూయించేందుకు ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంట‌ర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు. ‘చాలా కాలం త‌ర్వాత’ తెలుగు తెర‌పైకి ఫ్యామిలీ ఎమోషన్స్, ఫుల్ లెంగ్త్ కామెడీతో రాబోతున్న ఈ మూవీ కచ్చితంగా సక్సెస్ అవుతుందని వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. (Musalodiki Dasara Panduga Release Date)


ఈ సంద‌ర్భంగా నిర్మాత రమణ వాళ్లె (Ramana Valle) మాట్లాడుతూ.. ప్రేక్షకులు థియేటర్లకు వస్తే.. రెండు గంటల పాటు కష్టాలన్నీ మర్చిపోయి హాయిగా నవ్వుకునేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాము. సినిమా అవుట్‌పుట్ పట్ల మేము చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఇప్ప‌టికే విడుద‌లైన ప్ర‌చార చిత్రాలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా ప్ర‌తి ఒక్క‌రికీ న‌చ్చుతుంద‌ని న‌మ్మ‌కంగా చెప్ప‌గ‌లం. ఈ సినిమాను మా పితృ స‌మానులైన దివంగ‌త ద‌ర్శ‌కుడు ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ‌కు అంకిత‌మిస్తున్నామని తెలిపారు. నాజర్‌తో పాటు అంజలి (Anjali), అనిత (Anitha) (‘నువ్వు నేను’ ఫేం), కోవై సరళ, శరణ్య, సత్య వంటి వారంతా ఈ చిత్రంలో ప్రముఖ పాత్రలను పోషించారు.

ఇవి కూడా చదవండి:

రాజీనామా.. నట్టి కుమార్ సంచలన నిర్ణయం

పవన్ కళ్యాణ్, విజయ్‌ల విజయ రహస్యం అదే: ఆర్జే బాలాజీ

అందుకే తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్ చేయడం లేదు- బోయపాటి శ్రీను

తన తొలి సినిమా హీరో విజయ్‌ పై ప్రియాంక చోప్రా షాకింగ్ కామెంట్స్!

Updated Date - May 13 , 2026 | 05:52 PM