యాటిట్యూడ్ స్టార్ వదిలిన ‘ముగ్గురు కోతులు’ ‘చిల్లర సాంగ్’.. ఎలా ఉందంటే
ABN, Publish Date - Sep 13 , 2026 | 09:58 PM
యూత్‌ఫుల్ కంటెంట్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న తాజా చిత్రం ‘ముగ్గురు కోతులు’. ఈ మూవీ నుంచి మరో పాటని మేకర్స్ విడుదల చేశారు.
యూత్‌ఫుల్ కంటెంట్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న తాజా చిత్రం ‘ముగ్గురు కోతులు’ (Mugguru Kothulu). జీఎస్ఆర్ క్రియేషన్స్ సమర్పణలో, స్కై ఫ్లేర్ నెట్‌వర్క్స్ సహ సమర్పణలో శోభారాణి గరిమెల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. కార్తీక్ గరిమెల్ల దర్శకత్వం వహిస్తున్నారు. తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో వర్షిక పాశం హీరోయిన్‌గా అలరించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టైటిల్ ట్రాక్‌కు ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభించగా.. తాజాగా మేకర్స్ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌ను మరింత వేగవంతం చేస్తూ సరికొత్త లిరికల్ సాంగ్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
ఈ చిత్రంలోని ఫన్ అండ్ ఎనర్జిటిక్ నంబర్ ‘చిల్లర సాంగ్’ (Chillara Song)ను ‘యాటిట్యూడ్ స్టార్’ చంద్రహాస్ (Attitude Star Chandrahas) అధికారికంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌కు తన ప్రత్యేక అభినందనలు తెలియజేసిన ఆయన.. సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.
‘చిల్లర సాంగ్’ అంటూ సాగే ఈ పాటకు ఎస్. సుహాస్ అందించిన బాణీలు, గాత్రం యూత్‌ను ఇట్టే ఆకట్టుకునేలా క్యాచీగా ఉన్నాయి. దీనికి గణేష్ బొడ్డ, సుహాస్ ఎస్ సంయుక్తంగా అందించిన సాహిత్యం నేటి తరం కుర్రాళ్ల లైఫ్‌స్టైల్‌కు అద్దం పడుతోంది. లిరికల్ వీడియోలో ముగ్గురు కుర్రాళ్లు సరదాగా చేసే అల్లరి, చిల్ అయ్యే విజువల్స్ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. రాజ్ నోముల సినిమాటోగ్రఫీ, జమీర్ షేక్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ చిత్రం నుంచి రాబోయే రోజుల్లో మరిన్ని క్రేజీ అప్‌డేట్స్ రానున్నాయి. పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం యూత్‌ను విశేషంగా అలరిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
‘దేవర 2’కి బ్రేక్.. త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్ 600 కోట్ల పౌరాణిక విస్ఫోటనం!
హ్యాట్రిక్ కాంబో రిపీట్.. మరో భారీ మాస్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్!
‘మండాడి’ బ్లాక్ బస్టర్ హిట్టని ముందే చెప్పారు: సూరి