‘దేవర 2’కి బ్రేక్.. త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్ 600 కోట్ల పౌరాణిక విస్ఫోటనం!
ABN , Publish Date - Sep 13 , 2026 | 09:37 PM
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత పాన్-ఇండియా స్థాయిలోనే కాకుండా గ్లోబల్ మార్కెట్‌లోనూ తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న తారక్.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అత్యంత భారీగా తెరకెక్కుతోన్న ‘డ్రాగన్’ షూటింగ్‌లో నిమగ్నమై ఉన్న విషయం తెలిసిందే.
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Man of Masses NTR) లైనప్‌లో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత పాన్-ఇండియా స్థాయిలోనే కాకుండా గ్లోబల్ మార్కెట్‌లోనూ తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న తారక్.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అత్యంత భారీగా తెరకెక్కుతోన్న ‘డ్రాగన్’ షూటింగ్‌లో నిమగ్నమై ఉన్నారు. అయితే, ‘డ్రాగన్’ విడుదల తర్వాత కొరటాల శివతో ప్లాన్ చేసిన ‘దేవర 2’ను ఈ ఏడాది చివర్లో లేదా 2027 ఆరంభంలో సెట్స్‌పైకి తీసుకెళ్లాలని తొలుత భావించారు. కానీ అనుకున్న రీతిలో సీక్వెల్ స్క్రిప్ట్ ఇంకా షేప్ కాకపోవడంతో కథా చర్చల దశలోనే ఆగిపోయింది. దీంతో ఎలాంటి జాప్యం లేకుండా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో ఇటీవల అనౌన్స్ చేసిన ప్రతిష్టాత్మక మైథలాజికల్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు తారక్ పూర్తి స్థాయిలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని తెలుస్తోంది. ‘డ్రాగన్’ పూర్తి కాగానే దాదాపు ఏడాదిన్నర కాలాన్ని ఈ సినిమా కోసమే ప్రత్యేకంగా కేటాయించనున్నారట.
‘అరవింద సమేత వీరరాఘవ’ లాంటి క్లాసిక్ బ్లాక్‌బస్టర్ తర్వాత ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో రానున్న రెండో చిత్రమిది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా రూ. 600 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ఈ విజువల్ వండర్‌ను నిర్మించనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు), నందమూరి కళ్యాణ్ రామ్ ఈ ప్రాజెక్ట్‌ను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ముఖ్యంగా పురాణాల్లోని ‘దేవసేనాపతి’ మురుగన్ కథ ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకోనుందని టాక్ నడుస్తోంది. ఇప్పటికే జూన్ 29న ‘Born in the North.. Worshipped in the South’ అంటూ ఇచ్చిన చిన్న ట్యాగ్‌లైన్ సోషల్ మీడియాను షేక్ చేసిన సంగతి తెలిసిందే.
వర్కింగ్ టైటిల్‌గా ‘గాడ్ ఆఫ్ వార్’ (God of War) అని ప్రచారం సాగుతున్నప్పటికీ, సినిమాలో తారక్ పాత్ర ఏమిటి.. స్వయంగా మురుగన్ అవతారంలో కనిపిస్తారా లేదా ఆ దివ్య శక్తితో కూడిన వారియర్‌గా కనిపిస్తారా అనే విషయాన్ని మేకర్స్ అత్యంత రహస్యంగా ఉంచారు. ప్రపంచవ్యాప్త ప్రేక్షకులను విస్మయానికి గురిచేసేలా అధికారిక ప్రకటన ద్వారా బిగ్ షాక్ ఇవ్వాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. అంతేకాకుండా, ఎన్టీఆర్‌కు ధీటుగా నిలిచే మరో పవర్‌ఫుల్ రోల్ కోసం బాలీవుడ్ నుంచి ఓ సూపర్ స్టార్‌ను రంగంలోకి దించేందుకు త్రివిక్రమ్ సన్నాహాలు చేస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్న ఈ పౌరాణిక దృశ్యకావ్యం భారతీయ సినీ చరిత్రలోనే సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి:
హ్యాట్రిక్ కాంబో రిపీట్.. మరో భారీ మాస్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్!
‘మండాడి’ బ్లాక్ బస్టర్ హిట్టని ముందే చెప్పారు: సూరి
‘పిఠాపురంలో.. అలా మొదలైంది’.. క్లైమాక్స్ సీన్‌కు కంటతడి పెట్టాల్సిందే!