‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’కు డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

ABN , Publish Date - May 04 , 2026 | 08:30 AM

త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ, అనీష్ కురువిల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఫన్ ఫిల్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’. ఈ చిత్ర విడుదల తేదీ ఫిక్సయింది.

Mr Work From Home Movie Still

త్రిగుణ్ (Thrigun), పాయల్ రాధాకృష్ణ (Payal Radhakrishna), అనీష్ కురువిల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఫన్ ఫిల్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ (Mr. Work From Home). ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై అరవింద్ మండ్యం నిర్మించారు. సిహెచ్.వి.ఎస్.ఎన్. బాబ్జీ సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా, సినిమాను మే 15న (Mr. Work From Home Release Date) గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ తెలియజేశారు. శ్రీ వెంకట సాయి ఫిల్మ్స్ ముత్యాల రామదాస్ డిస్ట్రిబ్యూషన్‌లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది.


ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ఫ్యూచర్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా ఉండబోతోందనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో ఈ సినిమా చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందని తెలిపారు. అంతేకాదు, ఒక అందమైన ప్రేమకథ కూడా ఇందులో ఉందని, ప్రేక్షకులను ఆకర్షించేలా ఈ ప్రేమకథను దర్శకుడు డిజైన్ చేశారని అన్నారు. నిజాయితీ గల అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకుంటే ఆ ప్రయాణం ఎంత వినోదాత్మకంగా ఉంటుందో ఈ సినిమాలో దర్శకుడు అద్భుతంగా చూపించబోతున్నారని, ఈ హృద్యమైన కుటుంబ కథా చిత్రం సమ్మర్‌లో ప్రేక్షకులకు సంపూర్ణ వినోదాన్ని అందిస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. నెల్లూరు సుదర్శన్, హర్ష చెముడు, గుండు సుదర్శన్ వంటి వారు ఇతర ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. త్వరలోనే ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించనున్నారు.


ఈ మూవీ త్రిగుణ్ కెరీర్‌కు ఎంతో కీలకమనే విషయం తెలియంది కాదు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ అందుకుంటానని ఆయన కూడా చెబుతున్నారు. చూద్దాం.. మే 15న ఏం జరుగుతుందో?

ఇవి కూడా చదవండి:

Varanasi: ‘వారణాసి’కి వాటర్ కొరత!.. మహేష్ సినిమాకు ప్రభుత్వం షాక్!

‘పెద్ది’తో ఫైట్‌కు మహేష్ బాబు ఓకే అంటాడా?

ఒకే వేడుకలో చైతూ-శోభిత, సమంత-రాజ్ జంటలు హల్చల్!

Updated Date - May 04 , 2026 | 08:37 AM