మోక్షజ్ఞ బర్త్‌డే.. బాలయ్య ఇచ్చే ట్రీట్ ఇదే

ABN , Publish Date - Aug 31 , 2026 | 11:59 PM

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, మాస్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతోన్న మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ NBK111. ఈ మూవీ నుంచి సాలిడ్ అప్డేట్ రాబోతోంది.

NBK111 Update

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), మాస్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni) కాంబినేషన్‌లో రూపొందుతోన్న మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ NBK111. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ బ్లాక్‌బస్టర్ విజయం సాధించడంతో, ఈ తాజా చిత్రంపై ప్రకటన వచ్చినప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఎక్కడా రాజీపడకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘ఎంట్రీ ఆఫ్ ఆన్ ఎరా’ ఫస్ట్ గ్లింప్స్‌లో బాలయ్య అల్ట్రా స్టైలిష్, పవర్‌ఫుల్ అవతార్‌లో కనిపించి మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించారు. అప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు.


ఈ క్రమంలో NBK111 నుంచి చిత్ర బృందం ఒక అదిరిపోయే బిగ్ అప్‌డేట్‌ను సిద్ధం చేసింది. ఈ సినిమా అధికారిక టైటిల్‌తో పాటు ప్రపంచవ్యాప్త థియేట్రికల్ విడుదల తేదీని సెప్టెంబర్ 6వ తేదీన అధికారికంగా ప్రకటించనున్నారు. ఆ రోజు విశేషం ఏమిటంటే.. నటసింహం తనయుడు నందమూరి మోక్షజ్ఞ తేజ (Nandamuri Mokshagna Teja) పుట్టినరోజు! తనయుడి బర్త్‌డే వేళ అభిమానులకు డబుల్ ధమాకా ట్రీట్ ఇచ్చేందుకు బాలయ్య ఈ క్రేజీ అప్‌డేట్‌ను లాక్ చేశారు. ఈ ప్రకటనతో అటు మోక్షజ్ఞ బర్త్‌డే సెలబ్రేషన్స్‌తో పాటు ఇటు సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో నందమూరి ఫ్యాన్స్‌కు పండుగ వాతావరణం నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది.


ఈ హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో బాలకృష్ణ సరసన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. వెర్సటైల్ యాక్టర్ మంచు మనోజ్ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. అత్యున్నత సాంకేతిక బృందం పనిచేస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. థమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. అరవింద్ ఎస్. కశ్యప్ సినిమాటోగ్రఫీని, ఎ.ఎస్. ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్‌ను, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా పవర్‌ఫుల్ సంభాషణలు రాస్తుండగా.. రామ్ లక్ష్మణ్, రవి వర్మ, వెంకట్ మాస్టర్స్ యాక్షన్ సన్నివేశాలను కొరియోగ్రఫీ చేస్తున్నారు. సెప్టెంబర్ 6న రాబోయే ఈ స్పెషల్ ట్రీట్‌తో NBK111 బాక్సాఫీస్ క్రేజ్ ఏ స్థాయికి చేరుతుందో చూడాలి..

ఇవి కూడా చదవండి:

నన్ను కూడా మీ గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తున్నందుకు థ్యాంక్స్: దుల్కర్

బాలయ్యతో ‘ఇరుముడి’ దర్శకుడు నిజమేనా..

నిర్మాత సి. కల్యాణ్ కుమారుడి వెడ్డింగ్ రిసెప్షన్‌లో ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్ రాధాకృష్ణ

Updated Date - Aug 31 , 2026 | 11:59 PM