‘మేము కాపులం’.. జాఫర్, గెటప్ శ్రీను ఇంటర్వ్యూలోని ట్విస్ట్ రివీలైంది!
ABN, Publish Date - May 02 , 2026 | 06:45 PM
క్యాస్ట్ పేరుతో సినిమా చేస్తారా? అని అన్నందుకు జర్నలిస్ట్ జాఫర్ పై యాక్టర్ గెటప్ శ్రీను ఫైర్ అవుతున్న వీడియో ఒకటి వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ వీడియో వెనుక ఉన్న అసలు ట్విస్ట్ రివీలైంది.
క్యాస్ట్ పేరుతో సినిమా చేస్తారా? అని అన్నందుకు జర్నలిస్ట్ జాఫర్ (Jaffar) పై యాక్టర్ గెటప్ శ్రీను (Getup Srinu).. ఫైర్ అవుతున్న వీడియో ఒకటి వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇదేదో ప్రమోషనల్ వీడియో.. అని అందరికీ ఆ వీడియో చూసినప్పుడే అర్థమైంది. కానీ, ‘మేము కాపులం’ అనే పేరు నిజంగానే వెబ్ సిరీస్‌కు పెడుతున్నారా? అని కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. అసలు విషయం ఏమై ఉంటుందా? అని ఆలోచిస్తున్న వారికి క్లారిటీ ఇచ్చేలా.. జాఫర్, గెటప్ శ్రీను ఇంటర్వ్యూలో నెలకొన్న వాగ్వివాదం వెనుక ఉన్న అసలు ట్విస్ట్‌ని రివీల్ చేస్తూ.. తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ వీడియోలో ఉన్న విషయం ఏమిటంటే.. ఇంతకు ముందు వీడియోలో ‘తొక్కలో ఇంటర్వ్యూ’ అంటూ కుర్చీ విసిరేసి వెళ్లిపోయిన గెటప్ శ్రీను.. ఇప్పుడు పోలీస్ గెటప్‌లో జాఫర్ ముందు ప్రత్యక్షమయ్యారు. ‘పోలీస్ గెటప్ ఏంటి?. నన్ను భయపెడదామని అనుకుంటున్నారా?’ అని జాఫర్ అడగగానే.. రజనీకాంత్ స్టైల్‌లో ఆయన డైలాగ్ చెప్పి.. అటు చూడండి! అని ఓ పోస్టర్ చూపించారు గెటప్ శ్రీను. ఆ పోస్టర్‌లో ‘మేము కాప్‌లం’ అని టైటిల్ ఉంది. కాప్ అంటే పోలీసు.. ‘మేము పోలీసులం’ అని చెప్పే క్రమంలో.. ఈ వెబ్ సిరీస్‌కు మేకర్స్ ‘‘మేము ‘కాప్’లం’’ (MemuCoPulam) అని టైటిల్ ఫిక్స్ చేశారు.
ఇదే విషయాన్ని జాఫర్‌కు గెటప్ శ్రీను వివరిస్తున్నారు. మరి ఆ విషయం చెప్పాలిగా బ్రదర్ అని జాఫర్ అంటే.. ‘ఎక్కడ చెప్పనిచ్చారండి?’ అని శ్రీను ప్రశ్నించారు. సరే.. రిలీజ్ డేట్ ఎప్పుడు? అని జాఫర్ అడిగితే.. ఆ విషయం నాకు కూడా తెలియదని గెటప్ శ్రీను చెప్పారు. ‘రిలీజ్ ఎప్పుడైనా సరే.. మీరు ఇంటర్వ్యూలో ప్రశ్నలతో ఎలా అయితే ఆడేసుకుంటారో.. ఈ సిరీస్‌లో మేము కూడా నవ్వులతో ఆడేసుకుంటాం. త్వరలోనే.. తెలుగు జీ5 ఓటీటీలోకి వచ్చేస్తున్నాం’ అని, జాఫర్‌కు గెటప్ శ్రీను క్లారిటీ ఇచ్చారు. అదన్నమాట అసలు విషయం.
ఇవి కూడా చదవండి:
పవన్ కళ్యాణ్ నివాసానికి సీఎం చంద్రబాబు.. ఫొటోలు వైరల్!
‘నా పెళ్ళాం నిప్పు రా’.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోస్ట్ వైరల్!
తొక్కలో ఇంటర్వ్యూ.. అంటూ కుర్చీ విసిరేసి వెళ్లిపోయిన గెటప్ శ్రీను!
కయాదు లోహర్ గురించి ఈ విషయాలు తెలుసా?